బాబీ కి బాలయ్య సవాల్!

దర్శకుడు బాబీ తల మీద ఇప్పుడు పెద్ద బాధ్యత పడింది. జస్ట్ మూడే మూడు నెలల్లో ఓ సినిమా తీసి పెట్టాలి. అది కూడా నందమూరి బాలయ్యతో. అయితే ఇక్కడ అదృష్టమేమిటంటే మూడు నుంచి…

దర్శకుడు బాబీ తల మీద ఇప్పుడు పెద్ద బాధ్యత పడింది. జస్ట్ మూడే మూడు నెలల్లో ఓ సినిమా తీసి పెట్టాలి. అది కూడా నందమూరి బాలయ్యతో. అయితే ఇక్కడ అదృష్టమేమిటంటే మూడు నుంచి నాలుగు నెలలు ప్రీ ప్రొడక్షన్ కు టైమ్ వుంది. ఈ టైమ్ లో కథ, మాటలు, పాటలు, షెడ్యూళ్లు అన్నీ పక్కాగా రెడీ చేసుకుని, షూటింగ్ ను మూడు నెలల్లో కానిచ్చేయాలి.

విషయం ఏమిటంటే ఈ ఏడాది సెప్టెంబర్ వరకు బాలయ్య తన భగవత్ కేసరి సినిమా షూట్ లో వుంటారు. డిసెంబర్ తరువాత నుంచి రాజకీయ కార్యకలాపాల్లోకి వెళ్లిపోతారు. ఈ మధ్యలో దొరికిన మూడు నెలల గ్యాప్ లో ఓ సినిమా చేసేయాలని అనుకున్నారు. 

కానీ దానికి బోయపాటి తన వల్ల కాదని చెప్పేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు వరకు రామ్ సినిమా మీద వుండి, ఆ తరువాత స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ అన్నీ చూసుకుని మూడు నెలల్లో, అది కూడా డిసెంబర్ లోపు సినిమా అంటే తన వల్ల కాదని బోయపాటి అనడంతో, ఆ చాన్స్ దర్శకుడు బాబీ కి వచ్చింది.

కొనవెంకట్ కథ, మాటలు అందించడానికి రెడీగా వుంటారు. కనుక బాబీకి కాస్త అండ వుండనే వుంటుంది. ఎంత కాదన్నా బాలయ్య సినిమా అంటే 80 రోజులు పైమాటే షూట్ చేయాల్సి వుంటుంది. భగవత్ కేసరి సినిమా ముగించుకుని వచ్చే బాలయ్య నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తే డిసెంబర్ నాటికి సినిమా రెడీ అయిపోవచ్చేమో? చూడాలి. ఇది బాబీకి పెద్ద టాస్క్ నే.