ఆదిపురుష్-నైజాం టికెట్ రేట్లు?

ఆదిపురుష్ సినిమా విడుదల ఇక కొద్ది రోజుల్లో వుంది. ఈ సినిమా టికెట్ రేట్లు తొలివారం రెగ్యులర్ గానే వుంటాయా? ఏమైనా పెంచుతారా? అన్నది ప్రశ్న. ప్రస్తుతం హైదరాబాద్ లో ఫ్లెక్సీ రేట్లు వున్నాయి.…

ఆదిపురుష్ సినిమా విడుదల ఇక కొద్ది రోజుల్లో వుంది. ఈ సినిమా టికెట్ రేట్లు తొలివారం రెగ్యులర్ గానే వుంటాయా? ఏమైనా పెంచుతారా? అన్నది ప్రశ్న. ప్రస్తుతం హైదరాబాద్ లో ఫ్లెక్సీ రేట్లు వున్నాయి. మల్టీ ఫ్లెక్స్ లు 200 నుంచి 300 రేటు వుంది. ఇంతకన్నా ఎక్కువ అవసరం పడుతుందా? లేదా? అన్న పాయింట్ వుండనే వుంది. ఆదిపురుష్ లాంటి మైథలాజికల్ సినిమాకు మరీ ఎక్కువ రేట్లు పెడితే వర్కవుట్ అవుతుందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

అదీ కాక రేట్లు పెంచమని అడిగితే, ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వదా? అన్న అనుమానం కూడా వుంది. టికెట్ రేట్లు పెంచడం మీద ఎగ్జిబిటర్లు పెద్దగా ఆసక్తిగా లేరని తెలుస్తోంది. టికెట్ రేట్లు పెంచితే జనం రారనే అభిప్రాయంతో నైజాంలోని కీలక ఎగ్జిబిటర్లు వున్నారు. అందువల్ల రేట్లు పెంచే అవకాశం తక్కువే కనిపిస్తోంది.

రేట్లు పెంచమని డిస్ట్రిబ్యూటర్ తరపు నుంచి ప్రతిపాదన వెళ్తుందా? లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఎగ్జిబిటర్లు మాత్రం క్లారిటీతోనే వున్నారు. సినిమా బాగుంటే వంద రూపాయల రేటు మీద కూడా బాహుబలి లాంటి సినిమాలు రికార్డ్ కలెక్షన్లు కళ్ల చూసాయి అన్నది వీరి వాదన.

ఇదిలా వుంటే ఆంధ్రలో మాత్రం రేట్లు కాస్త తక్కువే వున్నాయి. అందువల్ల 50 నుంచి 100 వరకు ఆదిపురుష్ కు అదనపు రేట్లు ఇచ్చే అవకాశం వుంది. యువి అధినేతలకు ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు వున్నాయి కనుక రేట్ల పెంపు ఆంధ్రలో సాధ్యం కావచ్చు అని తెలుస్తోంది.