Advertisement

Advertisement


Home > Politics - Andhra

జగన్ పథకాలకు జడుసుకుంటున్న చంద్రబాబు

జగన్ పథకాలకు జడుసుకుంటున్న చంద్రబాబు

రాష్ట్రంలో పేద వర్గానికి చెందిన ఏ ఒక్క కుటుంబం కూడా ప్రస్తుతం ప్రభుత్వం నుంచి చేయూత పొందకుండా లేదు. అన్ని వర్గాలకు చెందిన పేదలకు ఏదో ఒక రకంగా రూపంలో సాయం అందించేలాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. 

ఎవరు మిస్ అయినా సరే అలాంటి వారికోసం ఒక సరికొత్త రూపంలో సంక్షేమ పథకాన్ని తీసుకువస్తున్నారు. ఇంత ఘనంగా ఎందుకు జరుగుతున్నది అంటే.. మౌలికంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభిలాషి! పేదలు ఆర్థిక అవసరాలకు ఎలాంటి ఇబ్బంది పడకూడదు, తన పాలన సాగుతుండగా.. ఎవరికీ కన్నీళ్లు రాకూడదు అనే భావన అంతరంగంలో ఉన్నవాడు గనుకనే.. జగన్ ఇన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలే ఇప్పుడు చంద్రబాబునాయుడులో వణుకు పుట్టిస్తున్నాయి.

మహానాడు సందర్భంగా.. సన్నాహాల్లో ఉన్న చంద్రబాబునాయుడు ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం కూడా అమలు చేసి తీరుతుందనే తీర్మానాన్ని మహానాడు వేదికగా ప్రవేశపెట్టడానికి సిద్ధం కావడానికి ఈ భయమే కారణం. ఇప్పుడున్న అన్ని సంక్షేమ పథకాలను తెలుగుదేశం సర్కారు వచ్చిన తర్వాత మరింత పెంచాలని, మరింత ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా చూడాలని పాలిట్ బ్యూరో నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

ఏ ఒక్క సంక్షేమ పథకం విషయంలో ప్రజలకు అనుమానం కలిగేలా ప్రవర్తించినా సరే.. తమ పార్టీ నెగ్గడం కాదు కదా.. కనీసం తమ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవనే భయం చంద్రబాబునాయుడులో ఉంది. అందుకే ఆయన ఈ సంక్షేమ పథకాలన్నీ ఇలాగే పదిలంగా ఉంటాయి అంటున్నారు.

చంద్రబాబు మాటలంటేనే ప్రజలకు అపనమ్మకం ఉంది. అందుకే ప్రజల తరఫున ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాం. వీటికి సమాధానం చెప్పగలిగితే ఆయన మాటల్ని నమ్మవచ్చు.

1) సంక్షేమ పథకాల్ని మరింత పెంచి ఇస్తాం అంటున్నారు కదా? ఎంత పెంచుతారు? ఏయే పథకాల్ని పెంచుతారు.. చెప్పగల ధైర్యం ఉందా?

2) తెలుగుదేశం గెలిస్తే తమ అయిదేళ్ల పాలన కాలంలో.. ఒక్క తెల్లరేషన్ కార్డును కూడా రద్దు చేయకుండా, ఒక్క పథకం నుంచైనా ఒక్క లబ్ధిదారుడినైనా తొలగించకుండా ఉంటాం అని చెప్పగల తెగువ ఉందా?

ఈ రెండు ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెబితే చంద్రబాబు మాటలను నమ్మడానికి వీలుంటుంది. వీటికి బుకాయింపు జవాబులు చెప్పినాసరే.. బాబును ఎవరూ నమ్మరు.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా