Advertisement

Advertisement


Home > Politics - Andhra

జగన్ పాలనపై చంద్రబాబు జోస్యం నిజమే!

జగన్ పాలనపై చంద్రబాబు జోస్యం నిజమే!

ఉగాది పర్వదినం నాడు సాధారణంగా రాజకీయ నాయకులు పంచాంగ శ్రవణం వింటారు. పండితులు పంచాంగాన్ని పరిపరివిధాలుగా వర్ణించి చెప్పగలరు గనుక.. ఏ పార్టీ ఆఫీసులో పంచాంగ శ్రవణం జరుగుతున్నప్పుడు.. ఆ పార్టీకి గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉన్నట్టుగా, వారికి వైభవం పట్టబోతున్నట్టుగా చెబుతుంటారు. 

ఇదంతా పక్కన పెడితే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా వెరైటీగా.. కేవలం పంచాంగం వినడంతో ఊరుకోకుండా.. పూజారి అవతారమెత్తి జోస్యం కూడా చెప్పారు. తన జోస్యం ద్వారా.. జగన్మోహన్ రెడ్డిన బద్నాం చేస్తున్నానని ఆయన అనుకున్నాడో  ఏమోగానీ ఆయన తన జోస్యంలో వాస్తవమే, జరగబోయేదే చెప్పారు. అయితే.. ఆ జరగబోయేది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సానుకూల పరిణామం అనే సంగతి ఆయన గుర్తించలేకపోయారు.

ఇంతకూ నారా చంద్రబాబు పురోహిత్ గారు సెలవిచ్చిన జోస్యం ఏమిటా అని విస్తుపోతున్నారు కదా.! ఈ శోభకృత్ ఏడాది  పొడవునా ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు రావడం ఖాయం అని ఆయన సెలవిచ్చారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రం కష్టాల్లోనే ఉన్నదిట. రాబోయే ఏడాదిలో మాత్రం.. రాష్ట్రమంతా కొత్త వెలుగులు ప్రసరిస్తాయట.

చంద్రబాబు చెప్పింది నిజమే. గతంలో ఆయన సాగించిన అయిదేళ్ల అత్యంత చెత్త పాలనకు తోడు కరోనా విలయం కూడా కాటు వేయడంతో.. రాష్ట్రం ఇన్నాళ్లూ అవస్థల మయంగా గడిపినది నిజమే. చంద్రబాబు దోపిడీ అనంతరం మిగిలిన రాష్ట్రాన్ని నెమ్మదిగా నిలదొక్కుకునేలా చేయడంలో జగన్ ఇప్పుడిప్పుడే కృతకృత్యులు అవుతున్నారు. ఈ ఏడాదిలో ప్రజల బాగోగుల పరంగా మంచి పరిణామాలు ఉండే సంకేతాలే కనిపిస్తున్నాయి. 

విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ కావడం.. వీటన్నింటికీ పెద్ద సంకేతం. ఆ సమ్మిట్ లో ఒప్పందాలు చేసుకున్న ఏ కొన్ని కంపెనీలు తమ తమ పరిశ్రమలు ప్రారంభించినా కూడా.. వేలకు వేల ఉద్యోగాలు రాష్ట్రంలో క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద తమ అసంతృప్తిని ప్రకటించిన పట్టభద్రులందరూ కూడా అప్పుడు జేజేలు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. 

చంద్రబాబు చెప్పింది నిజమే. ఈ ఏడాది మొత్తం రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రావడం ఖాయం. కాకపోతే.. అది జగన్మోహన్ రెడ్డి పాలన కారణంగానే సాధ్యమవుతుంది. ఎందుకంటే.. ఈ శోభకృత్ ఏడాది వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికే పూర్తవుతుంది. ఎన్నికలు ఇంచుమించుగా ఆ తర్వాతే జరుగుతాయి. అంటే ఈ తెలుగు ఏడాది పొడవునా ఉండే జగన్ సర్కారే.. ప్రజలకు కొత్త వెలుగులు చూపిస్తుందని.. చంద్రబాబునాయుడు జోస్యం చెప్పినట్టుగా ఇది కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?