Advertisement

Advertisement


Home > Movies - Movie News

మూకుమ్మడిగా హ్యాండ్ ఇచ్చిన టాప్ హీరోలు

మూకుమ్మడిగా హ్యాండ్ ఇచ్చిన టాప్ హీరోలు

"టాలీవుడ్ లో ఉగాది అప్ డేట్స్ హడావుడి" అనే టైటిల్ తో ఇప్పటికే ఓ కథనం చదివాం. మరి అందులో అల్లు అర్జున్ ప్రస్తావన ఉందా? పోనీ మహేష్ బాబు సినిమా గురించి ఏమైనా ఉందా? కనీసం రామ్ చరణ్ చేస్తున్న సినిమా గురించి ఏమైనా ఉందా? వీళ్లెవరూ ఈ ఉగాదికి తమ సినిమా అప్ డేట్స్ ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే వీళ్లంతా మూకుమ్మడిగా ఆడియన్స్ కు హ్యాండ్ ఇచ్చారు. కేవలం ఉగాది విశెష్ చెప్పి చేతులు దులుపుకున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ విడుదల చేస్తారనే ప్రచారం నడిచింది. టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారని కొందరన్నారు. అయితే అలాంటిదేం ఉండదని, ఉగాదికి ముందే యూనిట్ క్లారిటీ ఇచ్చింది. కానీ పర్వదినాన కనీసం పోస్టర్ లేదా ఇంకేదైనా అప్ డేట్ ఉంటుందని మహేష్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. ఎలాంటి సందడి లేదు.

మహేష్ సినిమా అంటే ఇంకా మొదట్లో ఉంది. కానీ రామ్ చరణ్-శంకర్ సినిమా మాత్రం చాలా షూటింగ్ పూర్తి చేసుకుంది. పైగా ఈ మూవీకి సంబంధించి ఎనౌన్స్ చేయడానికి చాలా ఉంది. టైటిల్ చెప్పొచ్చు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయొచ్చు.. కనీసం షూటింగ్ అప్ డేట్ అయినా ఇవ్వొచ్చు. కానీ ఇలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు, ఇప్పట్నుంచి ప్రచారం ఎందుకని అనుకున్నారేమో.

ఇక అల్లు అర్జున్ సంగతి సరేసరి. ప్రచారం విషయంలో గుంపులో గోవిందయ్యలా ఉండడం బన్నీకి నచ్చదు. కాబట్టి పుష్ప-2 నుంచి ఎలాంటి అప్ డేట్ ఉండదనే విషయం అల్లు అర్జున్ ఆర్మీకి ముందే తెలుసు. పైగా ఇది సుకుమార్ సినిమా. ఏ చిన్న పోస్టర్ రిలీజ్ చేయాలన్నా, కనీసం 20 రోజుల ముందునుంచే హడావుడి ఉంటుంది. అలాంటిందే కనిపించలేదు.

ప్రభాస్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు. చేతిలో చాలా సినిమాలున్నాయి. దాదాపు అన్నీ సెట్స్ పై ఉన్నాయి. కానీ ఒక్కటంటే ఒక్క సినిమా నుంచి కూడా అప్ డేట్ లేదు. మరీ ముఖ్యంగా ఆదిపురుష్ ప్రచారం ప్రారంభించమని, ప్రభాస్ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఉగాది పర్వదినాన, కనీసం ఆ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసినా బాగుండేది. పవన్ కూడా అంతే, చేతిలో చాలా సినిమాలున్నప్పటికీ ఎలాంటి ప్రకటన లేదు, సందడి లేదు.

ఉన్నంతలో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్లు బెటర్. ఈ ఉగాదికి భోళాశంకర్, సైంధవ్ సినిమాల అప్ డేట్స్ తో చిరు, వెంకీ సందడి చేయగా.. తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో బాలయ్య కూడా అదరగొట్టాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?