
టీడీపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు 120 నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొందరికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కలుపుకుంటే మొత్తం 80 మంది అభ్యర్థులకు చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. 95 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయాల్సి వుంది.
లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టే నాటికి పూర్తిస్థాయిలో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి లోకేశ్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. ఏడాది పాటు ఆయన జనం మధ్యే గడపనున్నారు. లోకేశ్ పాదయాత్ర ఖర్చులను అభ్యర్థులే భరించాల్సి వుంది. దీంతో తమకు టికెట్ ఖరారు చేస్తే తప్ప లోకేశ్ పాదయాత్ర ఖర్చుల్ని పెట్టుకోలేమని నేతలు తెగేసి చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తన మనస్తత్వానికి భిన్నంగా అభ్యర్థుల ఎంపిక ముందే చేయడానికి సిద్ధమయ్యారు. మరోవైపు జనసేనతో పొత్తు ప్రచారం జరుగుతున్నప్పటికీ, చంద్రబాబు మాత్రం అభ్యర్థుల ఎంపికలో తన పని తాను చేసుకుపోవడం గమనార్హం.
జనసేనకు మహా అయితే 20 లోపు సీట్లు ఇచ్చేందుకు మాత్రమే టీడీపీ సిద్ధంగా వుంది. అంతకు మించి జనసేనకు సీట్లు ఇస్తే నష్టపోతామని చంద్రబాబును టీడీపీ ముఖ్య నేతలు హెచ్చరిస్తున్నట్టు తెలిసింది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా