ఓట్లు కొన్న ఎన్నారైలకు బాబు స్పెషల్ థాంక్స్!

చంద్రబాబు నాయుడు టాప్ ప్రయారిటీ ఎవరో ఆయన చెప్పకనే చెప్పుకున్నారు. పార్టీ కోసం ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలు, ప్రాణాలొడ్డి పోరాడిన వారు, ఇంకా పార్టీ కోసం కొట్లాడుతున్న వారు వీళ్లంతా పక్కకు పోయారు. కేవలం…

చంద్రబాబు నాయుడు టాప్ ప్రయారిటీ ఎవరో ఆయన చెప్పకనే చెప్పుకున్నారు. పార్టీ కోసం ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలు, ప్రాణాలొడ్డి పోరాడిన వారు, ఇంకా పార్టీ కోసం కొట్లాడుతున్న వారు వీళ్లంతా పక్కకు పోయారు. కేవలం పార్టీ కోసం ఓట్లు కొనడానికి వచ్చిన వాళ్లు చంద్రబాబునాయుడు కు ఫస్ట్ ప్రయారిటీ అయిపోయారు.

పోలింగ్ తర్వాత మొట్టమొదటగా చంద్రబాబు వరాలు కురిపిస్తున్నది ఎన్నారై తెలుగుదేశం వారికే! వారు ఏర్పాటు చేసుకున్న విందు సమావేశంలో చంద్రబాబు జూమ్ ద్వారా ప్రసంగించి.. వారికి థాంక్స్ చెప్పుకున్నారు. వరాలు అందించారు. చంద్రబాబు నాయుడు కోటరీ ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా.. తెలుగుదేశమే అధికారంలోకి వస్తే గనుక.. పాలనలో ప్రాధాన్యాలు ఎలా ఉండబోతున్నాయో ఇదే పెద్ద ఉదాహరణ.

రాష్ట్రంలో పోలింగ్ పర్వం ముగిసిపోయింది. తెలంగాణలో సెటిలైన ఆంధ్రోళ్లంతా బస్సులు, రైళ్లు, సొంత వాహనాలూ చేసుకుని తిరిగి వెనక్కు వస్తున్నారు. వాళ్లందరూ ఓటు వేయాలనే కర్తవ్యం నిర్వహించడానికి శ్రమకోర్చి స్వస్థలాలకు వెళ్లినందుకు మనం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.

కానీ ఎన్నారై తెలుగుదేశం వారి కథా కమామీషూ వేరు. వారంతా కేవలం ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి లక్షా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని రాలేదు. అదనంగా రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తమ తమ పల్లెల్లో ఓట్లు హోల్ సేల్ గా కొనడానికి వచ్చారు. తమ ప్రత్యర్థి పార్టీకి పడే ఓట్లను కుటుంబాలకు కుటుంబాలుగానే ప్రలోభపెట్టి డబ్బులిచ్చి కొనడం కోసమే డబ్బు సంచులతో వచ్చారు.

ఈ సంగతి ఆరోపణ కాదు- నిజం! ఎన్నారై తెలుగుదేశం కన్వీనర్ కోమటి జయరాం ఈ మేరకు ఎన్నారైలతో ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో స్వయంగా చెప్పిన మాటలు.. వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలోని మాటల్ని ఆయన సమర్థించుకున్నారు కూడా.

ఆ రకంగా తన కోసం, తన పార్టీని గెలిపించడం కోసం, తనను నాలుగోసారి ముఖ్యమంత్రిని చేయడం కోసం విదేశాలనుంచి తరలివచ్చిన వారితోనే చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా జూమ్ ద్వారా సమావేశమై స్పెషల్ థాంక్స్ చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే ఎన్నారైల పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తాం అంటున్నారు. అంటే.. మీరు దోచుకోవడానికి మళ్లీ డోర్లు తెరుస్తాం అని సిగ్నల్ ఇస్తున్నారన్నమాట!

ఏది ఏమైనప్పటికీ.. పోలింగ్ తర్వాత చంద్రబాబు తొలి మీటింగుతోనే.. ఆయన ప్రయారిటీస్ ఎలా ఉంటాయో ఇప్పుడు అర్థమవుతోందని ప్రజలు అనుకుంటున్నారు.