
అభిమాన విప్లవ నాయకుడి కుమార్తె, మనుమరాలు తెలుగు రాష్ట్రాలకు వచ్చినా, జనసేనాని పవన్‌కల్యాణ్ మాత్రం కలవలేదు. తనకు చే గువేరా అంటే ఎంతో ఇష్టమని పదేపదే పవన్‌కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రపంచ విప్లవ పోరాట యోధుడు చే గువేరా. సామ్రాజ్యవాదులపై పోరాటం చేసే వాళ్లు చేగువేరాను ఆదర్శంగా తీసుకుంటారు. అణచివేత, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం అలుపెరగని యుద్ధం చేసిన చే గువేరా స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ సజీవంగా వుంటుంది.
ఈ నేపథ్యంలో చేnగువేరా కుమార్తె అలైదా గువేరా, మనుమరాలు ఎస్తేఫానియా భారత్ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ వివిధ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. చే గువేరా ఆదర్శాలకు నడుచుకుంటున్న వారిని సాదరంగా తెలుగు సమాజం ఆహ్వానించింది. వారిలో చే గువేరాను చూసుకుంటున్నారు.
తనకు చే గువేరా ఆదర్శం, స్ఫూర్తి అని చెప్పుకునే జనసేనాని పవన్‌కల్యాణ్ మాత్రం వారిని పట్టించుకోలేదు. తనకిష్టమైన నాయకుడి కన్నబిడ్డ, మనుమరాలనే కాకుండా, ఆయన ఏ ఆదర్శాల కోసమైతే జీవితాన్ని త్యాగం చేశారో, అదే బాటలో నడుస్తున్న వారిని కలవడం గౌరవమనే ఉద్దేశంతో ఈ రెండు మాటలే తప్ప, మరే ఉద్దేశం కాదు. మతతత్వ విధానాలకు చే గువేరా పూర్తి విరుద్ధం. మరో వైపు వాటికి ప్రతినిధులుగా చెప్పుకునే పార్టీతో పవన్ అంటకాగడం తెలిసిందే.
కొన్ని సందర్భాల్లో ప్రధాన ప్రత్యర్థి జగన్‌ను టార్గెట్ చేసేందుకు, హిందూ మతానికి తానొక ప్రతినిధి అంటూ పవన్ వేషాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్‌కల్యాణ్ అన్న, జనసేన నాయకుడు నాగబాబు ఏకంగా గాంధీని చంపిన గాడ్సేని సమర్థించిన మహానుభావుడు. అయినప్పటికీ చే గువేరా గురించి పది మందికి తెలియజెప్పడంలో పవన్ ప్రముఖ పాత్ర పోషించడాన్ని విస్మరించకూడదు. అందుకే చే భౌతిక, భావజాల వారసులు మన దగ్గరికి వస్తే...పవన్ కలవకపోవడం ఏంటబ్బా? అనే చర్చకు తెరలేచింది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా