Advertisement

Advertisement


Home > Politics - Andhra

పాత విమర్శలే కొత్తగా ఆయన నోటితో...!

పాత విమర్శలే కొత్తగా ఆయన నోటితో...!

పాచిపోయిన లడ్డూలు అంటూ పవన్ చాలా బాగా కోట్ చేశారు ఒకానొక సమయంలో. అలాగే రాజకీయాల్లో కూడా విమర్శలు తాజాగా ఉండాలి. పాతవి తీసుకుంటే పాచిపోయాయనే అంటారు. అలా గత నాలుగేళ్లుగా అందరూ ఎన్నో సార్లు వాడేసి పాచిపోయిన విమర్శలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టుకున్నారు అంటున్నారు.

జగన్ ఢిల్లీ వెళ్ళేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని తాజాగా కొత్తగా ఆ పాత విమర్శను చేశారు. ఈ మాట ఇప్పటికి ఎన్నో సార్లు అంతా అంటున్నదే వింటున్నదే. ఢిల్లీకి జగన్ ఈసారి వెళ్లేది అవినాష్ రెడ్డిని అరెస్ట్ నుంచి తప్పించడానికట. ఇది కూడా పాచిపోయిన లడ్డూ లాంటి విమర్శే అని వైసీపీ నేతలు మండుతున్నారు.

జగన్ ఈ నెల 27న ఢిల్లీలో జరిగే నీతి అయోగ్ మీటింగ్ కి ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతున్నారు. ఇది అఫీషియల్ గా షెడ్యూల్ చేయబడిన ప్రోగ్రాం. దీన్ని పట్టుకుని గంటా వారు ఘాటైన విమర్శగా చేయాలనుకుని పాతదే వల్లిస్తున్నారు అని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

జగన్ ఢిల్లీ వెళ్లేది నీతి అయోగ్ మీటింగ్ లో మాట్లాడేది అంతా అఫీషియల్ గానే ఉంటుంది. ఆయన ఏమి మాట్లాడింది కూడా బయటకు వస్తుంది. అయినా సరే జగన్ కచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లడం లేదని మాజీ మంత్రి ఎలా చెబుతారని వైసీపీ నేతలు అంటున్నారు.

గంటా నాలుగేళ్లుగా రాజకీయంగా యాక్టివ్ గా లేకపోవడం వల్ల ఇలాంటి విమర్శలు చాలా మంది చేశారు అన్నది మరచిపోయి ఉంటారని సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు మెప్పు కోసమే జగన్ని విమర్శిస్తున్నారు అని అంటున్నారు. రెండు వేల నోట్ల మీద గంటా మాట్లాడుతూ ఇది మంచి నిర్ణయం అన్నారు. ఎవరి దగ్గర నోట్లు ఎక్కువగా ఉంటాయో వారికే ఇబ్బంది అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

సీబీఐ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదో అని ఆయన మరో డౌట్ వ్యక్తం చేశారు. మీన మేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరు అయిన దాని కంటే ఎగవేసినదే ఎక్కువ అని గంటా అంటున్నారు. దాన్ని కూడా సజ్జల రామక్రిష్ణారెడ్డి చెప్పాలని ఎద్దేవా చేశారు. ఇలా కనుక చూసుకుంటే వైసీపీ మీద గంటా బాగానే విమర్శలు చేశారనుకోవాలి. అయితే అందులో పేలేవి ఎన్ని అన్నదే చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?