Advertisement

Advertisement


Home > Politics - Andhra

భీమిలీలో అవంతి విజయం తధ్యమా...?

భీమిలీలో అవంతి విజయం తధ్యమా...?

విశాఖ జిల్లాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సీటుగా భీమిలీ ఉంటుంది. రేపటి రోజున వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే కోర్ క్యాపిటల్ గా భీమిలీయే ఉంటుంది. సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు కూడా భీమిలీలోనే ఉంటుంది. రాజకీయంగానే కాకుండా అన్ని రకాలుగా ఎంతో ప్రాధాన్యత ఉన్న భీమిలీని గెలవాలని వైసీపీ పట్టుదలగా చూస్తోంది. టీడీపీకి ఒకనాడు భీమిలీ కంచుకోట. మళ్లీ పాగా వేయాలని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని బరిలోకి దించింది.

వైసీపీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు భీమిలీ నుంచి ఎమ్మెల్యే అయిన ఘనత అవంతిదే. గతంలో రాజులు ఎక్కువ సార్లు గెలిచిన హిస్టరీని కలిగి ఉన్నారు. పాతికేళ్ళుగా చూస్తే రెండు సార్లు ఎమ్మెల్యే అయింది మాత్రం అవంతి అని చెప్పాలి.

ఈసారి కూడా గెలిచి తనకు తిరుగులేదనిపించుకోవాలని అవంతి చూస్తున్నారు. అవంతి ఈ రోజున ప్రచారం మొదలెట్టలేదు. రెండేళ్ళుగా గడప గడపకూ తిరిగారు. ఆ విధంగా ఆయన భీమిలీ ప్రచారంలో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారు. అవంతి అంటే అందుబాటులో ఉండే నాయకుడు అని పేరుంది.

దాంతో ఆయన పట్ల సానుకూలత ఉంది. వైసీపీ పధకాలు కూడా ఫ్యాన్ పార్టీకి జోరు పెంచుతున్నాయి. ఈ క్రమంలో అవంతి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారు అని ప్రచారం మొదలైంది. దాంతో భీమిలీలో ఏమి జరుగుతుంది అన్న టెన్షన్ వైసీపీ క్యాడర్ లో ఉంది. గంటాకు ధీటు అయిన అభ్యర్ధిగా అవంతిని అంతా చూస్తున్నారు.

దీని మీద అవంతి మీడియా ముందుకు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చారు. తన ప్రచారానికి జనాల నుంచి వస్తున్న స్పందన తట్టుకోలేకనే గంటా శ్రీనివాసరావు ఈ విధంగా దుష్ప్రచారం చేయిస్తున్నారు అని మండిపడ్డారు. తాను ఎక్కడికీ పోవడంలేదు, భీమిలీలోనే ఉంటాను, ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాను అని అవంతి చెప్పారు.

అవంతి ఎంపీ అంటూ జరుగుతున్న ప్రచారం కావాలని చేశారా అన్న దాని మీద రాజకీయంగా చర్చ సాగుతోంది. అవంతిని భీమిలీ నుంచి పోటీలో ఉండకుండా చేసేందుకేనా ఈ ప్రయత్నం అని కూడా వైసీపీలో మాట్లాడుకుంటున్నారు. ఈ దుష్ప్రచారం పట్ల వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతూనే తాము బలంగా ఉన్నాం కాబట్టే ఇలా చేస్తున్నారు అని ఇది కూడా తమ గెలుపునకు సంకేతంగా ఉందని అంటున్నారు. అవంతి అయితే ఈ నెల 24న తాను నామినేషన్ దాఖలు చేస్తాను అని ప్రకటించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?