
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శలు జనసేనాని పవన్‌కల్యాణ్‌కు కోపం తెప్పించాయి. ఈ సందర్భంగా జగన్‌పై ట్విటర్ వేదికగా సెటైర్ కార్టూన్‌ను పవన్‌కల్యాణ్ షేర్ చేయడం విశేషం. ఈ వ్యంగ్య కార్టూన్ జనసేన టీం క్రియేటివిటీ. జగన్ పాలనలో బెదిరింపులు, దోపిడీలు, భూఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయనే అర్థంలో చిత్రాలతో కార్టూన్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
నీ భూమి కాయితాల ఎక్కడున్నాయో చెప్పు... లేదా అంటూ ఓ రౌడీ మరో వ్యక్తి గొంతుపై కత్తి పెట్టడం, అలాగే, ఏయ్ ముసిలోడా ... నీ పింఛన్ డబ్బులు, పీఎఫ్, ఎల్లైసీ పాలసీలు, ఇటు తే...లేదా అంటూ వృద్ధుడిని బెదిరిస్తున్న ఫొటో, ఇలా మరికొన్ని అంశాలపై జనసేన తనదైన సృజనాత్మక శైలిలో జగన్ ప్రభుత్వ విధానాలకు దృశ్య రూపం ఇచ్చింది.
మరోవైపు జనవాణి - జనసేన భరోసా అంటూ పేదల నుంచి పవన్ అర్జీ స్వీకరించిన చిత్రాన్ని ప్రత్యేకంగా అందులో పొందుపరిచారు. జనసేనను రౌడీ సేనగా జగన్ విమర్శించిన నేపథ్యంలో.... తాము ప్రజాసేవకులమని, వైసీపీది రౌడీ ప్రభుత్వమనే అర్థాన్ని ఇచ్చేలా ఆ పార్టీ వ్యంగ్య కార్టూన్‌ను తెరపైకి తెచ్చింది. ఈ కార్టూన్‌కు ఓ పోస్టును కూడా జత చేశారు.
‘ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రత్యర్థి పార్టీని 'రౌడీ సేన' అని దూషించిన జగన్!’ అంటూ కార్టూన్ కింద రాసుకొచ్చారు. మరీ ముఖ్యంగా కత్తి పట్టుకున్న ఓ రౌడీ ఇది రౌడీ సేన నమ్మకండి అంటూ ...పవన్‌కల్యాణ్ అర్జీ తీసుకుంటున్న వైపు చూపుతున్నట్టుగా వుంది. ఇలా చూపుతున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్‌పై కార్టూన్ ఆయుధంతో వెటకరించారు. దీన్ని పవన్‌కల్యాణ్ ట్విటర్‌లో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. జగన్ విమర్శ పవన్‌కు మంట పుట్టించిందనేందుకు ఈ కార్టూనే నిదర్శనం. పవన్‌కల్యాణ్ నోరు తెరవకుండా, ట్విటర్ వేదికగా జగన్‌కు కౌంటర్ ఇవ్వడాన్ని గమనించొచ్చు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా