Advertisement

Advertisement


Home > Politics - Andhra

అన్న జనసేన... తమ్ముడు టీడీపీ

అన్న జనసేన... తమ్ముడు టీడీపీ

రాజకీయం అంటే ఇలాగే ఉండాలేమో. పార్టీలు వేరుగా ఉంటే రాజకీయం పండుతుంది. అన్ని విధాలుగా కలిసివస్తుంది. అయిదేళ్ల పాటు రాజకీయ అజ్ఞాత వాసం చేసి జనసేన ద్వారా టికెట్ సాధించి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్ధి అయిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు టీడీపీ నుంచి సహకారం ఎంతవరకూ దక్కుతుందో అన్న అనుమానాలు ఉన్నాయి.

టీడీపీకి బలమైన సీటు పొత్తు పేరుతో జనసేనకు ఇవ్వడంతో తమ్ముళ్ళు లోలోపల మండిపోతున్నారు. అయినా అధినాయకత్వం అదేశాల మేరకు పనిచేస్తున్నారు. టీడీపీలో ఎంతో మంది ఆశావహులు ఉన్నారు. వారిని కాదని కొణతాల సీటు తెచ్చుకున్నారు.

దాంతో ఇపుడు టీడీపీలో పూర్తి మద్దతు పొందేందుకు ఆయన ఆలోచించారో ఏమో తెలియదు ఆయన తమ్ముడు కొణతాల రఘునాధ్ టీడీపీలోకి చేరిపోయారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. దాంతో తమ్ముడు టీడీపీలో ఉండడం కొణతాలకు కలసివస్తుంది అని అంటున్నారు.

కొణతాల రఘునాధ్ 2014లో వైసీపీ తరఫున అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆయన వియ్యంకుడు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచారు. 2019 నాటికి అన్నదమ్ములు ఇద్దరూ వైసీపీకి దూరం అయ్యారు. ఇన్నాళ్ళ తరువాత కొణతాల జనసేనలో చేరితే తమ్ముడు టీడీపీ సైకిలెక్కారు.

దీంతో అన్నదమ్ముల రాజకీయం బాగుందని అంతా అంటున్నారు. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా పాలిటిక్స్ చేస్తున్నారు అని రెండు పార్టీలలో ఉన్న ఇతర నేతలు అనుకోవడం జరుగుతోంది. టీడీపీ నుంచి అన్నకు సహకారాలు అందించి గెలిపించడమే ఇపుడు తమ్ముడు టార్గెట్ అని అంటున్నారు. రేపటి రోజున టీడీపీలో తమ్ముడు కీలక నేతగా ఎదిగినా కొణతాలకు రాజకీయ లాభమే అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?