Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఈసీ చూస్తోందా?: ఓట్ల కొనుగోలులో బరితెగింపు!

ఈసీ చూస్తోందా?: ఓట్ల కొనుగోలులో బరితెగింపు!

ఓట్ల కొనుగోలు విషయంలో తెలుగుదేశం పార్టీ బరితెగింపుకు నిదర్శనం ఇది. ఓట్ల కొనడం అనేది చాటు మాటు వ్యవహారం లాగా సాగడం లేదు. ఆ పార్టీ విషయానికి వస్తే బహిరంగంగా.. మీటింగులో ప్రధాన వక్త.. మీరంతా డబ్బులిచ్చి ఓట్లను కొనండి.. ఇది చాలా క్లిష్ట సమయం.. డూ ఆర్ డై సిచుయేషన్.. మీరు డబ్బు పెట్టి కుటుంబాలను కొనేయండి.. అని చెప్పడం.. ఆ వీడియో బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఇంతగా బరితెగింపు రాజకీయాలు చేస్తోంటే ఈసీ ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నదా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

కోమటి జయరాం ఎన్నారై టీడీపీ విభాగానికి కన్వీనర్. ఆయన ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ.. పల్లెల్లో ఓట్ల కొనుగోలు గురించి తమ పార్టీ వారికి, ప్రత్యేకించి ఎన్నారైలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మనం మన గ్రామాలకు వెళితే.. ఎవరు ఎవరికి ఓట్లు వేస్తారో మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంటుందని ఆయన అన్నారు.

ఈ వెధవ మనకు ఖచ్చితంగా ఓటు వేయడు.. అని మనకు అర్థమవుతుంది. అలాంటి వారి కుటుంబాలను లొంగదీసుకోవడానికి మనం పని చేయాలి. ప్రతి వెధవకు ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి కొన్ని అవసరాలుంటాయి. ఆ అవసరాలు మనం తీర్చాలి. తీరుస్తామని చెప్పాలి. ప్రలోభపెట్టాలి. మొత్తానికి వారిని లొంగదీసుకోవాలి. వారితో తెలుగుదేశానికి ఓటు వేయించాలి.. అంటూ కోమటి జయరాం చెప్పిన మాటలు లీకయ్యాయి.

ఎన్నారై తెలుగుదేశానికి చెందిన వాళ్లు ప్రతి నియోజకవర్గంలోని కనీసం వెయ్యి ఓట్లు టార్గెట్ గా పెట్టుకుని.. మన పార్టీకి పడే అవకాశం లేని ఓట్లను వేయించడానికి ప్రయత్నించాలని ఆయన పిలుపు ఇచ్చారు. అవసరమైతే ఒక్కొక్కరు, ఒక్కో కుటుంబానికి రెండు మూడు లక్షలు ఇచ్చి అయినా సరే.. వారి ఓట్లను వేయించాలని అంటున్నారు. ఈ గదిలో కూర్చున్నవారికి (ఎన్నారైల సమావేశం గదిలో) రెండు మూడు లక్షలంటే పెద్ద విషయం కానే కాదు. డబ్బుతోనే లొంగేట్లయితే ఆ మేరకు డబ్బులు పంచి వారిని లొంగదీసుకోవాలి అని జయరాం అనడం.. వివాదాస్పదం అవుతోంది.

ఈ వీడియో క్లిపింగ్ తో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఎన్నారై టీడీపీ వారి ద్వారానే వందల కోట్ల రూపాయల డబ్బును రాష్ట్రంలో ఓట్ల కొనుగోలుకు వెదజల్లడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈసీ కోమటి జయరాంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?