Advertisement

Advertisement


Home > Politics - Andhra

విరామం త‌ర్వాత పాద‌యాత్ర‌కు రెడీ

విరామం త‌ర్వాత పాద‌యాత్ర‌కు రెడీ

నాలుగు రోజుల విరామం త‌ర్వాత పాద‌యాత్ర‌కు నారా లోకేశ్ రెడీ అయ్యారు. మ‌ళ్లీ ఆయ‌న పాద‌యాత్ర విడిది కేంద్రానికి సోమ‌వారం సాయంత్రానికి చేరుకున్నారు. నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్ ఈ నెల 23న క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌వేశించారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఈ నెల 24, 25 తేదీల్లో రెండురోజుల పాటు పాద‌యాత్ర చేశారు.

అనంత‌రం రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన మ‌హానాడు కోసం నాలుగు రోజులు విరామం ఇచ్చారు. మ‌హానాడు వేడుక‌ను పూర్తి చేసుకుని తిరిగి ఈ నెల 29న క‌డ‌ప విమానాశ్ర‌యానికి లోకేశ్ చేరుకున్నారు. విమానాశ్ర‌యంలో ఆయ‌న‌కు టీడీపీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆయ‌న జ‌మ్మ‌ల‌మ‌డుగు శివారులోని విడిది కేంద్రానికి చేరుకున్నారు.

110 రోజుల్లో మొత్తం  1423 కి.మీ లోకేశ్ న‌డిచారు. ఇవాళ 111వ రోజు జ‌మ్మ‌ల‌మ‌డుగు శివారులోని విడిది కేంద్రం నుంచి పాద‌యాత్ర మొద‌ల‌వుతుంది. సాయంత్రం బ‌హిరంగ స‌భ వుంటుంది. టీడీపీ మేనిఫెస్టోను విడుద‌ల చేసిన నేప‌థ్యంలో దాని గురించి విస్తృతంగా ప్ర‌చారం చేసే అవ‌కాశం వుండొచ్చు. 

ద‌స‌రాకు రెండో మేనిఫెస్టో కూడా తీసుకొచ్చేందుకు టీడీపీ క‌స‌ర‌త్తు చేస్తోంది. మేనిఫెస్టోను జ‌నంలోకి లోకేశ్ ఎంత వ‌ర‌కు తీసుకెళ్ల‌గ‌ల‌రో చూడాలి. ప్ర‌ధానంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అందిస్తార‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించాల్సి వుంటుంది. అదే లోకేశ్‌, చంద్ర‌బాబుల‌కు పెద్ద టాస్క్‌. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?