వైసీపీలో ఒకే ఒక్కడు

ఆయన మంత్రి పదవి రాలేదని ఎంతగా ఆవేశపడ్డారో అంతా చూశారు. సీనియర్ ఎమ్మెల్యే అని తనకు మంత్రి పదవి ఇవాల్సిందే అని పట్టుబట్టారు. మరోసారి అధికారంలోకి వస్తే చూద్దామని పార్టీ పెద్దలు నచ్చచెప్పారు. అయితే…

ఆయన మంత్రి పదవి రాలేదని ఎంతగా ఆవేశపడ్డారో అంతా చూశారు. సీనియర్ ఎమ్మెల్యే అని తనకు మంత్రి పదవి ఇవాల్సిందే అని పట్టుబట్టారు. మరోసారి అధికారంలోకి వస్తే చూద్దామని పార్టీ పెద్దలు నచ్చచెప్పారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు కానీ లక్కీ జాక్ పాట్ ఆయనే తగిలింది.

ఇంతకీ ఆయన ఎవరు అంటే పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ తాజా మెంబర్ గొల్ల బాబూరావు. ఆయన ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబడితే పెద్దల సభలో టికెట్ ఇచ్చారు. తాజా ఎన్నికల ఫలితాలతో ఉత్తరాంధ్రలో మొత్తం సీట్లు వైసీపీ కోల్పోయింది పాయకరావుపేట సీటుతో సహా.

అయితే ఇంతకు రెండు నెలల క్రితం బాబూరావుని రాజ్యసభకు వైసీపీ నామినేట్ చేసింది. దాంతో ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదు. 2030 ఏప్రిల్  దాకా ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగనున్నారు. ఏ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆయన పదవి పదిలంగా ఉండబోతోంది.

దాంతో బాబూరావు అనుచరులు తెగ సంబర పడుతున్నారు. మా నాయకుడు కోరినట్లుగానే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉంటే ఇపుడు ఆయన పరిస్థితి కూడా వైసీపీలో అందరిలాగానే ఉండేది అని తలచుకుని దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. బాబూరావు హ్యాపీగా ఆరేళ్ల ఎంపీగా ఉండబోతున్నారు. ఆయన లక్ ని చూసిన వారు ఈయన కదా ఒకే ఒక్కడు మొత్తం వైసీపీలో అని అంటున్నారు. బాబూరావు 2009లో వైఎస్సార్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మూడు సార్లు ఎమ్మెల్యే ఒక సారి ఎంపీగా నెగ్గారు. ఆయన రాజకీయ జీవితం ఒక విధంగా చూస్తే సక్సెస్ ఫుల్ అని అంటున్నారు అంతా.