నాలుగోసారి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సభలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ పెద్దలు హాజరయ్యారు.
విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా 2014- 2019లో పని చేసిన ఆయన తిరిగి 2024లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీ మంత్రులుగా పలువురు కూటమి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు, నందమూరి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు ప్రమాణం చేస్తుండగా జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.