Advertisement

Advertisement


Home > Politics - Andhra

వైసీపీలో ఎమ్మెల్సీ టెన్ష‌న్‌

వైసీపీలో ఎమ్మెల్సీ టెన్ష‌న్‌

వైసీపీని ఎమ్మెల్సీ టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఇవాళ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీల‌ను ఎన్నుకోవాల్సి వుంది. 8 మంది బ‌రిలో ఉన్నారు. నిజానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఒక ఎమ్మెల్సీ ప‌దవి ద‌క్కాల్సి వుంది. అయితే 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో న‌లుగురు వైసీపీ వైపు ఉన్నారు. అయితే ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో టీడీపీ త‌మ అభ్య‌ర్థిని బ‌రిలో దింపింది. టీడీపీ త‌ర‌పున పంచుమ‌ర్తి అనురాధ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు.

ఒక్కో ఎమ్మెల్సీకి 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవ‌స‌రం. ఈ లెక్క‌న వైసీపీకి ఏడుగురు ఎమ్మెల్సీల‌ను ద‌క్కించుకునే బ‌లం ఉంది. వైసీపీ ఇద్ద‌రు అసంతృప్త ఎమ్మెల్యేలను క‌లుపుకున్నా టీడీపీకి ఇంకా ఒక‌రి మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలో వైసీపీలో అంస‌తృప్తుల‌పై టీడీపీ ఆశ పెట్టుకుంది. రానున్న ఎన్నిక‌ల్లో టీకెట్లు ఇచ్చేది లేద‌ని ముందే చెప్ప‌డం ఎంత త‌ప్పో ఇప్పుడు వైసీపీ పెద్ద‌ల‌కు అర్థ‌మ‌వుతోంది. అలాంటి వాళ్లు తాజా ఎన్నిక‌ల్లో ఓటు వేస్తారో, లేదో అనే అనుమానం వైసీపీని వెంటాడుతోంది.

ఇప్ప‌టికే మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో వైసీపీ ఓడిపోయి షాక్‌లో వుంది. ఇవాళ ఏడింటిని గెలుచుకోక‌పోతే ప్ర‌తిప‌క్షాల నుంచి ఎదురు దాడి పెరిగే ప్ర‌మాదం వుంద‌ని వైసీపీ ఆందోళ‌న చెందుతోంది. అందుకే ప్ర‌తి ఓటూ ఎంతో కీల‌కంగా భావించిన రెండు మూడు సార్లు త‌మ ఎమ్మెల్యేల‌తో మాక్ పోలింగ్ చేప‌ట్టారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింద‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు.

ఆ త‌ప్పు మ‌రోసారి పున‌రావృతం కాకూడ‌ద‌ని ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై వైసీపీ సీరియ‌స్ దృష్టి పెట్టింది. అసంతృప్తులను బుజ్జ‌గించేందుకు వారి ప‌నుల్ని చ‌క‌చ‌కా చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏది ఏమైనా ఏడు స్థానాల్లో గెలుపే ధ్యేయంగా వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. చివ‌రికి ఎవ‌రి ఎత్తులు ఫ‌లిస్తాయో రాత్రి వెల్ల‌డ‌య్యే ఫ‌లితాలు తేల్చ‌నున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?