Advertisement

Advertisement


Home > Politics - Andhra

కాంట్రాక్ట‌ర్.. బీజేపీ రెబ‌ల్ గా బ‌రిలోకి దిగుతాడా?

కాంట్రాక్ట‌ర్.. బీజేపీ రెబ‌ల్ గా బ‌రిలోకి దిగుతాడా?

వ‌ర‌దాపురం సూరి.. త‌న కాంట్రాక్టు వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టుకోవ‌డానికే బీజేపీలోకి చేరాడ‌నే విమ‌ర్శ‌ను ఎద‌ర్కొనే క‌మ‌లం పార్టీ నేత‌! ఇప్పుడు క‌మ‌లం పార్టీపై ఆయ‌న విధేయ‌త ఎంతో బ‌య‌ట‌ప‌డే సంద‌ర్భం వ‌చ్చింది. గ‌తంలో తెలుగుదేశం పార్టీ నేత‌గా వ్య‌వ‌హ‌రించిన సూరి.. చంద్ర‌బాబుకు ఇప్ప‌టికీ అతి స‌న్నిహితుడిగా పేరు. టీడీపీ ఏపీలో అధికారాన్ని కోల్పోయిన వెంట‌నే బీజేపీ తీర్థం పుచ్చుకున్న వారిలో ఈయ‌నా ఒక‌రు! 

ఇక గ‌త రెండు మూడు నెల‌లుగా సూరి హ‌డావుడి పెరిగింది. తెలుగుదేశం- బీజేపీ పొత్తు అనే వార్తల ద‌గ్గ‌ర్నుంచి టికెట్ పై ఈయ‌న‌కు ఆశ‌లు పుట్టుకొచ్చాయి. అప్ప‌టి వ‌ర‌కూ నియోజ‌క‌వ‌ర్గం, క్యాడ‌ర్ అనేదేమీ ప‌ట్టించుకోని సూరి ఉన్న‌ట్టుండి ప‌చ్చ‌కండువాలు మెడ‌లో వేసుకుని నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌సాగారు! సొంత డ‌బ్బుల‌తో రోడ్ల‌ను బాగు చేస్తానంటూ బ‌య‌ల్దేరారు ఈయ‌న‌! అయితే గ‌త ఐదేళ్ల‌లో గుర్తుకు రాలేదు, ఎన్నిక‌ల ముందు షో చేసే ప్ర‌య‌త్నం చేశారు.

బీజేపీ త‌ర‌ఫున బరిలోకి దిగే చంద్ర‌బాబు సన్నిహితుల్లో ఒక‌రిగా సూరి పేరు వినిపించింది. అయితే ఎందుకో ఆఖ‌ర్లో ట్విస్ట్. ధ‌ర్మ‌వ‌రం అభ్య‌ర్థిగా చంద్ర‌బాబుకు స‌న్నిహిత బీజేపీ నేత‌ల్లో ఒక‌రిగా పేరున్న స‌త్య‌కుమార్ కు అవ‌కాశం ద‌క్కింది! క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన సూరికి బ‌దులు బీసీ అయిన స‌త్య‌కుమార్ కు ధ‌ర్మ‌వ‌రం టికెట్ ను కేటాయించి బీజేపీ!

అయితే సూరి పోటీ చేసినా, స‌త్య‌కుమార్ పోటీ చేసినా.. ధ‌ర్మ‌వ‌రంలో ఆ పార్టీ బ‌లం చెప్పుకోవ‌డానికి కూడా ఏమీ లేదు! మ‌రి ఇప్పుడైతే వ‌ర‌దాపురం సూరికి టికెట్ లేద‌నే క్లారిటీ వ‌చ్చేసింది. ఇప్పుడు ఆయ‌న త‌ను బీజేపీ అంటూ స‌త్య‌కుమార్ విజ‌యం కోసం ప‌ని చేస్తారా.. ఇక క‌మ‌లం పార్టీ కండువాతో ప‌ని లేద‌ని తీసేస్తాడా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం! అవ‌స‌రార్థం వేసుకున్న క‌మ‌లం కండువాతో పొత్తు రూపంలో ధ‌ర్మ‌వ‌రం టికెట్ పై ఆశ‌లు పెట్టుకున్న సూరి రెబ‌ల్ గా బ‌రిలోకి దిగే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్న‌ట్టున్నాయి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?