
జనసేనాని పవన్‌కల్యాణ్ పర్యటన అంటే కనీసం రెండు వారాలు ముందుగా ప్రచారం మొదలవుతుంది. కానీ అందుకు విరుద్ధంగా ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండానే ఇవాళ ఆయన ఏపీకి వెళుతున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలోని ఒక గది ప్రారంభం పేరుతో ఆయన ఏపీలో పర్యటించడం గమనార్హం. పనిలో పనిగా జనసేన నాయకులతో కూడా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే పవన్ పర్యటన అనేక ఊహాగానాలకు తెరలేచింది. రాజధాని ప్రాంతంలో 51 వేలకు పైగా నిరుపేద కుటుంబాలకు నివాస స్థలాల పట్టాల పంపిణీని శుక్రవారం సీఎం వైఎస్ జగన్ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని జగన్ మాటల్లో చెప్పాలంటే దుష్టశక్తులన్నీ ఏకమవుతున్నాయి. ఇందులో భాగంగానే పవన్‌కల్యాణ్ పర్యటన ఖరారైందా? అనే చర్చకు తెరలేచింది. తనకు నచ్చని వారి కార్యక్రమాలను చెడగొట్టడం పవన్‌కు వెన్నతో పెట్టిన విద్యే.
గతంలో చంద్రబాబు హయాంలో విజయవాడలో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ధర్మదీక్ష చేపట్టిన సందర్భంలో పవన్ వ్యవహరించిన తీరు ఇప్పటికీ గుర్తుండే వుంటుంది. తన తల్లిని తిట్టించారంటూ హైదరాబాద్‌లో ఫిల్మ్ చాంబర్‌లో పవన్ చేసిన అల్లరి అంతాఇంతా కాదు. సరిగ్గా ధర్మదీక్ష కార్యక్రమం చేపట్టిన రోజే పవన్ అల్లరి చేయడంపై అప్పట్లో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ తీరు సరైంది కాదని చంద్రబాబు తప్పు పట్టారు.
కేవలం తమ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించడానికే పవన్‌కల్యాణ్ నానాయాగీ చేశారని అప్పట్లో చంద్రబాబు విరుచుకుపడ్డారు. మీడియాను తన వైపు తిప్పుకోవడం ద్వారా, తమ కార్యక్రమానికి ప్రచారం లేకుండా చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పవన్‌కల్యాణ్ వాలకం చూస్తే, జగన్ చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి ఏదో రకంగా అడ్డు తగిలేందుకే ఆయన్ను చంద్రబాబు పంపించి వుంటారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
జగన్‌కు వ్యతిరేకంగా ఏం చేయడానికైనా పవన్ వెనుకాడని సంగతి తెలిసిందే. జగన్‌పై వ్యక్తిగత ద్వేషాన్ని పక్కన పెట్టి, 51 వేలకు పైగా నిరుపేద కుటుంబాలకు ప్రయోజనం కలిగే కార్యక్రమానికి ఆటంకం కలిగించికపోతే, అదే మేలు చేసినట్టు అవుతుందని పవన్ గ్రహిస్తే మంచిది. ఒకవేళ చంద్రబాబు కోసం ప్రస్తుతం సాగుతున్న ప్రచారాన్ని నిజం చేసేలా పవన్ వ్యవహరిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా