Advertisement

Advertisement


Home > Movies - Movie News

తేజ టచ్ ఈ హీరోయిన్ కు వర్కవుట్ అవుతుందా?

తేజ టచ్ ఈ హీరోయిన్ కు వర్కవుట్ అవుతుందా?

తేజ చేతిచలవతో టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు కొంతమంది ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాజల్. తేజ స్కూల్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత తక్కువ టైమ్ లోనే నంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. కాజల్ అంత కాకపోయినా.. రీమా సేన్, సదా లాంటి తారలు కూడా టాలీవుడ్ లో బాగానే క్లిక్ అయ్యారు.

ఇప్పుడు మరో అమ్మాయి వంతు వచ్చింది. ఈమె పేరు గీతిక తివారి. తేజ డైరక్ట్ చేసిన అహింస సినిమాతో ఈమె టాలీవుడ్ కు పరిచయమౌతోంది. తేజకు ఉన్న ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఇప్పుడీ అమ్మాయిపై అందరి దృష్టి పడింది.

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కు చెందిన అమ్మాయి గీతిక. గ్రాడ్యూయేషన్ చేసిన ఈమె, సినిమాలపై ఇంట్రెస్ట్ తో మోడలింగ్ లోకి ఎంటరైంది. దర్శకుడు తేజ కొత్తమ్మాయి కోసం చూస్తున్నాడని తెలిసి, హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చింది. అలా అహింస ప్రాజెక్టులోకి ఎంటరైంది.

సాధారణంగా తేజ సినిమాల్లో హీరోలు అమాయకంగా ఉంటారు, హీరోయిన్లు గడుసుగా కనిపిస్తారు. అహింస సినిమాలో కూడా తనది గడుసైన అమ్మాయి పాత్ర అంటోంది గీతిక. కొన్ని సందర్భాల్లో హీరోకు దిశానిర్దేశం చేసే ఛాయల్లో కూడా కనిపిస్తుందట గీతిక పోషించిన అహల్య పాత్ర.

అహింస సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది గీతిక. ఈ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకోవాలనే ఆమె ప్రయత్నం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?