Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆదిపురుష్.. మరో సంచలన ప్రచారం

ఆదిపురుష్.. మరో సంచలన ప్రచారం

కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది ఆదిపురుష్ ప్రచారం. మొన్నటికిమొన్న ట్రయిలర్ లాంఛ్ ఏ స్థాయిలో జరిగిందో చూశాం. ఇప్పుడు రెండో పాట రిలీజ్ కోసం కూడా అదే స్థాయిలో ప్రచారం చేయబోతోంది యూనిట్.

ఆదిపురుష్ సినిమా నుంచి ఇప్పటికే జైశ్రీరామ్ అనే సాంగ్ రిలీజై, పెద్ద హిట్టయింది. ఇప్పుడు సెకెండ్ లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నారు. 29న రాబోతోన్న ఈ సాంగ్ కోసం చాలా పెద్ద స్కెచ్ రెడీ చేశారు.

దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మే 29 మధ్యాహ్నం 12గంటలకు ఈ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించబోతున్నారు.

మ్యూజిక్ ఛానెల్స్, మూవీ ఛానెల్స్ లో సైతం ఆ టైమ్ కు సాంగ్ ను ప్రసారం చేస్తారు. నార్త్ లో హిందీ భాష లో ఈ సాంగ్ ప్రసారం అవుతుంది. ఇక సౌత్ లోని ఆయా రాష్ట్రాలకు సంబంధించి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సాంగ్ ను ప్రసారం చేస్తారు.

రామ్ సియా రామ్ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. సచేత్-పరంపర కంపోజ్ చేశారు. ఈ సాంగ్ తో ఆదిపురుష్ పై హైప్ మరింత పెరుగుతుందని భావిస్తోంది టీమ్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?