Advertisement

Advertisement


Home > Politics - National

ఫినిషింగ్ టచ్ స్టార్ట్ చేసిన 'మెటా'

ఫినిషింగ్ టచ్ స్టార్ట్ చేసిన 'మెటా'

లే-ఆఫ్స్ లో భాగంగా ఇప్పటికే ఉద్యోగాల తొలిగింపు ప్రక్రియను వేగవంతం చేసిన ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా.. ఇప్పడు తుది అంకానికి చేరుకుంది. జాబ్ కట్స్ లో భాగంగా మూడో రౌండ్ ఎలిమినేషన్ ను తాజాగా ప్రారంభించింది. ఇందులో భాగంగా చాలామంది ఉద్యోగాలు పోయాయి.

మెటా గ్రూప్ లో తమ ఉద్యోగాలు పోయినట్టు చాలామంది లింక్డిన్ సైట్ లో ప్రకటించారు. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ కూడా నిర్థారించింది. యాడ్ సేల్స్, మార్కెటింగ్, పార్టనర్ షిప్ టీమ్స్ లో ఎక్కువ ఉద్యోగాలకు కోత పడినట్టు రాయిటర్స్ తెలిపింది. 2021 జూన్ నాటికి మెటాలో ఎంతమంది ఉద్యోగులున్నారో, ఆ స్థితికి ఉద్యోగుల సంఖ్యను కుదించినట్టు తెలుస్తోంది.

ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని మెటాలో ఉద్యోగాలు తొలిగిస్తున్నట్టు గతంలోనే ప్రకటించింది ఆ సంస్థ. ఇందులో భాగంగా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాల్లో కోత విధించింది. తాజా లే-ఆఫ్స్ తో మెటా ప్రకటించిన ఉద్యోగుల తొలిగింపు ప్రక్రియ దాదాపు పూర్తయినట్టుగా కనిపిస్తోంది.

మే చివరి వారం వరకు మెటాలో లే-ఆఫ్స్ నడుస్తాయని జుకర్ బర్గ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరమైతే, ఆ తర్వాత కూడా మరో నెల పాటు లే-ఆఫ్స్ ప్రక్రియను స్వల్పంగా కొనసాగిస్తామని ఆయన తెలిపాడు.

జుకర్ బర్గ్ ప్రకటన ఆధారంగా చూసుకుంటే.. మెటాలో ఉద్యోగుల తొలిగింపు ప్రక్రియ దాదాపు ముగిసినట్టే అనుకోవాలి. మెటాకు చెందిన కంపెనీల్లో నాన్-ఇంజినీరింగ్ ఉద్యోగాలే ఎక్కువగా పోయాయి. వీటిని తగ్గించుకొని, కోడింగ్, ఏఐ, వర్చువల్ రియాలిటీ పై దృష్టిపెట్టింది మెటా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?