
సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర జంటకు ఆయన మూడో భార్య రమ్య రఘుపతి గట్టి షాక్ ఇచ్చారు. నరేశ్, పవిత్ర జంటగా నటించిన "మళ్లీ పెళ్లి" సినిమా ఈ నెల 26న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. నరేశ్ పర్సనల్ లైఫ్‌లోని కొన్ని ఘట్టాలను తీసుకుని సినిమా తెరకెక్కించారు.
ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సినిమా ఎలా వుంటుందోనన్న ఆసక్తి నెలకుంది. సరిగ్గా సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు రమ్య రఘుపతి భారీ షాక్ ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సినిమాను చిత్రీకరించారని, కావున విడుదలను ఆపాలంటూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో రమ్య రఘుపతి పిటిషన్ వేశారు. దీంతో ఫ్యామిలీ కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకుంది.
సినిమా విడుదలకు ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఈ సమయంలో తనను కించపరిచేలా సినిమాలోని కొన్ని సీన్స్ ఉన్నాయంటూ రమ్య రఘుపతి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నరేశ్, పవిత్ర కాస్త అతి చేయడం వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చిందనే కామెంట్స్ లేకపోలేదు. సినిమా పేరుతో నరేశ్, పవిత్ర జంట చెట్టపట్టాలేసుకుని తిరగడం, పెళ్లికి సంబంధించి సీన్స్ వైరల్ కావడంతో రమ్య జీర్ణించుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్య రఘుపతిని నరేశ్ 2010లో మూడో వివాహం చేసుకున్నారు. వాళ్లిద్దరి మధ్య మనస్పర్థం విడిపోయే వరకూ దారి తీశాయి. అయితే విడాకులు తీసుకోవాల్సి వుంది. ఈ లోపు పవిత్రతో నరేశ్ కలిసి జీవిస్తున్నారు. అదే నిత్యం వివాదానికి దారి తీసింది. చివరికి వాళ్ల మధ్య విడాకుల వ్యవహారం సినిమాపై కూడా ఎఫెక్ట్ పడే వరకూ వెళ్లింది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా