Advertisement

Advertisement


Home > Politics - Andhra

పవన్ పదో తరగతి.. జాగ్రత్త పడిన 'జనసేన'

పవన్ పదో తరగతి.. జాగ్రత్త పడిన 'జనసేన'

సరిగ్గా ఐదేళ్ల కిందటి సంగతి. దాదాపు ఇదే సమయంలో పవన్ కల్యాణ్ నామినేషన్ వేశారు. ఆ టైమ్ లో ఆయన విద్యార్హతలపై జోరుగా చర్చ సాగింది. ఎందుకంటే, అఫిడవిట్ లో ఆయన టెన్త్ పాస్ అని మాత్రమే ప్రస్తావించారు.

అఫిడవిట్ కు కొన్ని రోజుల ముందు మాత్రం తననుతాను ఇంటర్ విద్యార్థిగా చెప్పుకున్నారు పవన్. నాగబాబు అయితే మరో అడుగు ముందుకేసి ఇంటర్మీడియట్ తో పాటు కొన్ని ఐటీ సబ్జెక్టుల్లో డిగ్రీ హోల్డర్ అంటూ ఇష్టమొచ్చినట్టు ఏదో మాట్లాడేశారు.

తాను ఎల్.ఎల్.బి. చదివి మద్రాస్ బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకున్నానని, చిరంజీవి డిగ్రీ పాసయ్యారని, ఒక చెల్లెలు ఎంబీబీఎస్, మరో చెల్లెలు డిగ్రీ చదివిందని చెప్పిన నాగబాబు.. కల్యాణ్ బాబు ఇంటర్మీడియట్ కాకుండా కొన్ని ఐటీ సబ్జెక్ట్స్ లో డిగ్రీ హోల్డర్ అని ముక్తాయించారు. ఆ టైమ్ లో నెటిజన్ల ట్రోలింగ్ కు అడ్డంగా దొరికిపోయారు.

అయితే ఈసారి మాత్రం పవన్ కుటుంబ సభ్యులతో పాటు జనసేన కూడా విద్యార్హతల విషయంలో చాలా జాగ్రత్తపడింది. ఈసారి కూడా తను పదో తరగతి మాత్రమే పాసయ్యానని పవన్ చెప్పుకున్నారు. అక్కడితో ఆ టాపిక్ ను అతడితో పాటు, కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ వదిలేసింది. గతంలోనా ఇష్టమొచ్చినట్టు లక్ష పుస్తకాలు చదివాడని, డిగ్రీలో ఐటీ చేశాడని, ఇంటర్ లో ఎంపీసీలో ఎంఈసీ చేశాడని చెప్పలేదు.

ఇక తన అఫిడవిట్ లో ఆస్తులు-అప్పుల వివరాల్ని భారీగా ప్రకటించారు పవన్. ఈ ఐదేళ్లలో పవన్ ఆస్తులు 215 శాతం పెరిగాయి. వాస్తవానికి ఇంతకంటే ఎక్కువే ఆయన ఆస్తుల చిట్టా ఉంటుందనేది బహిరంగ రహస్యం. ఆ విషయానికొస్తే పవన్ ది మాత్రమే కాదు, అఫిడవిట్ సమర్పించిన ఏ నాయకుడి ఆస్తి అయినా ఎక్కువగానే ఉంటుంది.

2019లో 5 కోట్ల రూపాయల అప్పు చూపించిన పవన్, ఈసారి మాత్రం తన అప్పును అమాంతం 65 కోట్లకు పెంచేశారు. అప్పుడు 5 కోట్ల అప్పును మైత్రీ మూవీ మేకర్స్ పేరిట చూపించిన పవన్.. ఈసారి 65 కోట్ల రూపాయల అప్పు కింద మరింత మంది వ్యక్తులు, సంస్థల పేర్లను వాడుకున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?