Advertisement

Advertisement


Home > Politics - Andhra

వామ్మో... నాదెండ్ల మ‌నోహ‌ర్ కొన్న కారు అంత రేటా?

వామ్మో... నాదెండ్ల మ‌నోహ‌ర్ కొన్న కారు అంత రేటా?

జ‌న‌సేన పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌పై వైసీపీ నాయ‌కుడు పోతిన మ‌హేశ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్‌పై ప‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నాదెండ్ల మ‌నోహ‌ర్‌కు సంబంధించి పోతిన కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. ముఖ్యంగా మ‌నోహ‌ర్ బినామీ పేరుతో కొన్న కారు విలువ తెలిస్తే అవాక్కు కావాల్సిందే.

జ‌న‌సేన ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థుల‌తో తెలుగుదేశం కార్యాల‌యం నుంచి చంద్ర‌బాబునాయుడు టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించార‌న్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్వ‌హించాల్సిన టెలికాన్ఫ‌రెన్స్ బాబు చేశారని విమ‌ర్శించారు. త్వ‌ర‌లో టీడీపీలో జ‌న‌సేన క‌లిసిపోతుంద‌ని తాను చెప్పిన విష‌యాన్ని పోతిన మ‌హేశ్ గుర్తు చేశారు. 

అస‌లు జ‌న‌సేన పార్టీ వుందా? లేదా?  ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీలో విలీనం చేశారా? ఈ ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

కాపు యువ‌త ప‌వ‌న్‌క‌ల్యాణ్ పెద్ద‌స్థాయికి వెళ్తార‌ని క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తుంటే, వాళ్ల‌ను మోసం చేసి, మ‌భ్య‌పెట్టి మ‌ళ్లీ చంద్ర‌బాబునాయుడి కోసం ప‌ని చేయించ‌డం ఏంటి? కాపు యువ‌త‌ను ఏం చేయాల‌ని అనుకుంటున్నారు? అని ఆయ‌న నిల‌దీశారు.

జ‌న‌సేన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ వ‌ద్ద క‌ష్ట‌ప‌డ‌కుండా డ‌బ్బు ఎలా సంపాదించాలో వెన్న‌తో పెట్టిన విద్య ఉంద‌ని దెప్పి పొడిచారు.

నాదెండ్ల మ‌నోహ‌ర్ త‌న బినామీ పేరుతో 10 కోట్ల విలువ చేసే స్పోర్ట్స్ కారును కొన్నార‌ని పోతిన సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు.  ఈ కారులో కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే కూచోగ‌ల‌రని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఈ డ‌బ్బులు మీకు ఎవ‌రిచ్చార‌ని ఆయ‌న నిల‌దీశారు. ఏ ఫిలిం ప్రొడ్యూస‌ర్ ఇచ్చార‌ని పోతిన మ‌హేశ్ నిల‌దీశారు. తెనాలిలో నాదెండ్ల మ‌నోహ‌ర్‌, ఆయ‌న అనుచ‌రులు ప్ర‌చారానికి వ‌స్తే... ఓటుకు రూ.10 వేలు తీసుకుని వైసీపీకి ఓటు వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అప్పుడు తెనాలి ద‌రిద్రం పోతుంద‌న్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?