
ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డల్లో తెలివిగల వారెవరైనా ఉన్నారంటే... మొదటి పేరు పురందేశ్వరిదే. అందుకే ఆమె రాజకీయాల్లో రాణిస్తున్నారు. అధికారం ఎక్కడుంటే అక్కడ ఆమె వాలిపోతున్నారు. ఎన్టీఆర్ బిడ్డ కావడంతో పురందేశ్వరిని నాడు కాంగ్రెస్ ఆదిరించింది, నేడు బీజేపీ అక్కున చేర్చుకుంది.
ఏపీ బీజేపీ సారథ్య బాధ్యతల్ని పురందేశ్వరి నిర్వర్తిస్తున్నారు. టీడీపీ అధినేత, తన చెల్లెలు భువనేశ్వరి భర్త అయిన చంద్రబాబునాయుడిని అవినీతి కేసులో వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో రకంగా టీడీపీకి మద్దతుగా మాట్లాడ్డం, ఇదే సందర్భంలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. జగన్‌పై పురందేశ్వరి ఎంత అక్కసుతో ఉన్నారంటే, ఇవాళ వినాయక చవితి పండుగను కూడా పట్టించుకోకుండా ప్రెస్‌మీట్ పెట్టి మరీ విమర్శలకు దిగారు.
పేరుకు మద్యం పాలసీపై విమర్శలు చేయడానికి అన్నట్టు కనిపించినా, చివరికి చంద్రబాబుకు మద్దతుగా బీజేపీ వుందని చెప్పడానికే అని ఆమె పార్టీ నాయకులు అనుమానిస్తున్నారు. చంద్రబాబును అవినీతి కేసులో అరెస్ట్ చేయడంతో, నువ్వేం తక్కువ అంటూ పురందేశ్వరి ప్రశ్నించడానికి పరితపించారు. మద్యం ద్వారా వేల కోట్ల అవినీతి జరుగుతోందని ఇవాళ పురందేశ్వరి విమర్శించడం వెనుక బాబు అరెస్ట్‌పై ఆమె ఓర్వలేనితనం బయట పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అవినీతికి ఎవరు పాల్పడినా శిక్షించాల్సిందే అని ఆమె మొసలు కన్నీరు కార్చారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి తామెవరిని ఆమె ప్రశ్నించారు. న్యాయస్థానంలో అన్నీ తేలుతాయన్నారు. అయితే బాబు అవినీతిపై సీఐడీ సమగ్ర విచారణ చేసిందా? లేదా? అనే అనుమానం తమకు ఉందని చెప్పడం ద్వారా, తన మరిది విషయంలో సానుకూలతను ప్రదర్శించారు.
చంద్రబాబును ఆమె ప్రత్యర్థి పార్టీకి అధినేతగా చూడడం లేదు. ఇంకా తన మరిది అనే అభిమానాన్నే చూపుతున్నారు. బాబు కోసమే పండుగ పూట కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆమె బంధుప్రీతికి సలాం చేయాల్సిందే.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా