Advertisement

Advertisement


Home > Politics - Andhra

సీబీఐ వారికి ఆర్ఆర్ఆర్ డైరక్షన్!

సీబీఐ వారికి ఆర్ఆర్ఆర్ డైరక్షన్!

పనీబాటా లేకుండా కూర్చుని ఉండే చాలామందికి తాము సినిమా డైరక్షన్ చేయగలమనే నమ్మకం ఉంటుంది. సినిమాలో ఇతర ఏ క్రాఫ్ట్ గురించి విమర్శలు చేయాలన్నా సరే.. దానికి సంబంధించి కొంత నాలెడ్జి అవసరం. కానీ దారిన పోయే ప్రతి దానయ్య కూడా ‘డైరక్టరు అలా కాకుండా ఇలా చేసి ఉండాల్సింది’ అని చెప్పేస్తారు. 

మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది అలాంటి డైరక్టర్ల గురించి కాదు. పనీబాటా లేకుండా కూర్చుని.. ఊరుమ్మడి కబుర్లనో పోచికోలు మాటలతో తన యూట్యూబ్ వందిమాగధులతో పంచుకుంటూ ఉండే పొలిటికల్ ఆర్ఆర్ఆర్.. రఘురామక్రిష్ణ రాజు గురించి.

సాధారణంగా తెలుగుదేశాన్ని భజన చేయడంలోనూ, భాజపాను కీర్తించడంలోనూ బిజీగా బతుకుతూ ఉండే రఘురామ ఈసారి ఇంకో అడుగు ముందుకు వేశారు. సీబీఐ అధికారులు ఎలా పనిచేయాలో ఆయన డైరక్షన్ ఇస్తున్నారు. వారు ఇలా చేయాలని చెబుతున్నారు.

సీబీఐ అవినాష్ రెడ్డిని ఇంకా అరెస్టు చేయలేదని ఉడికిపోతున్న రఘురామ, తాజాగా అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని వారికి హితవు చెబుతున్నారు. సీబీఐ అధికారులకు వారి పని ఏం చేసుకోవాలో వారికి తెలియదా? లేదా.. తనమీద నాలుగు రుణ ఎగవేత కేసులు, ఏపీ సీఐడీ కేసులు ఉండే సరికి.. వాటివిషయంలో విపరీతమైన అనుభవం వచ్చేసి.. తాను సీబీఐను కూడా డైరక్షన్ చేయగలిగేంత జ్ఞానం సంపాదించానని రఘురామ అనుకుంటున్నారా అనేది తెలియదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. తనను గెలిపించిన నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి కూడా యోగ్యత లేకుండా చేసుకున్న వ్యక్తి రఘురామ. తనను గెలిపించిన ప్రజల మొహం కూడా చూడకుండా ఏళ్లతరబడి ఢిల్లీ హైదరాబాదుల్లో మాత్రమే మకాం వేస్తూ ఆయన కుటిల రాజకీయం చేస్తుంటారు. మాపార్టీ చాలా గొప్పది.. కానీ, ఈ ప్రభుత్వం దుర్మార్గమైనది అంటూ.. టెక్నికల్ డైలాగులు వల్లిస్తూ జగన్ సర్కారు మీద కుటిల విమర్శలూ చేస్తుంటారు. 

బిజెపి నాయకుల ప్రాపకంతో ఢిల్లీలో మనుగడ సాగిస్తున్నారు. మరోవైపు చంద్రబాబునాయుడును భజన చేస్తుంటారు. మళ్లీ ప్రజల్లోంచి గెలిచే సత్తా తనకు లేకపోయినప్పటికీ.. చంద్రబాబు ఏ రాజ్యసభ సభ్యత్వాన్నో ముష్టిగా వేస్తారేమో అనేది ఈ రాజుగారి ఆశ. ఆయన యూట్యూబ్ కుటిల మాటలు, రాజకీయాలు.. బాబు భజన వరకు పరిమితమైతే బాగానేఉంటుంది గానీ.. ఏకంగా సీబీఐను కూడా తానే డైరక్ట్ చేయాలనుకోవడం, వారికి సూచనలు చేయడం మరీ అతిగా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?