Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఇటు క్రికెట్ ఫీవర్...అటు వరుణుడి వార్నింగ్

ఇటు క్రికెట్ ఫీవర్...అటు వరుణుడి వార్నింగ్

విశాఖలో ఈ సండె క్రికెట్ పండుగ. క్రికెట్ అభిమానులకు గొప్ప వేడుక. డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో ఈ నెల 19న ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండవ  వన్డే  మ్యాచ్ జరగనుంది. దీని కోసం సర్వం సిద్ధం అయింది.

టికెట్లు సైతం హాట్ కేకుల్లా కొద్ది రోజుల ముందే అమ్ముడైపోయాయి. ఈ వన్డే మ్యాచ్ కోసం కళ్ళు కాయలు కాచేలా క్రికెట్ ఫేవర్స్ ఎదురు చూస్తూ ఆ ఫీవర్ తో నిండా వేడెక్కారు. అటు వైపు ఆకాశం చూస్తే వరుణుడి వార్నింగ్స్ తో బెంబేలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఎపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మబ్బుల ముసుగులో ప్రస్తుతం  విశాఖ ఉంది.

ఇండియా అస్ట్రేలియా జట్ల మధ్య డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ కోసం అంతా ఎదురుచూస్తున్న వేళ వరుణుడు కరుణిస్తాడా లేదా అన్నదే అందరిలోనూ టెన్షన్ పెడుతున్న విషయంగా ఉంది. ఈ నెల 17న ముంబైలో జరిగిన ఇండియా అస్ట్రేలియా మొదటి వన్డేలో టీమిండియా అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆ జోరుని రెండవ వన్డే మ్యాచ్ లోనూ కంటిన్యూ చేయాలనుకుంటోంది. వరుణుడా దయ ఉంచు అంటూ ఇపుడు క్రికెట్ అభిమానులు దండాలు పెడుతున్నారు. రేపటికి వాతావరణం కాస్తా మారితే క్రికెట్ పండుగా చక్కగా జరుగుతుందని అంతా ఆశిస్తున్నారు. కాలం కాని కాలంలో వేసవి మొదట్లో వానగండం పొంచి ఉండడం క్రికెట్ ఫ్యాన్స్ ని చికాకు పెడుతోంది. ప్రశాంతంగా క్రికెట్ మ్యాచ్ ముగియాలన్న విశాఖ వాసుల ప్రార్ధనలు ఫలిస్తాయో లేదో మరి కొద్ది గంటలలో తేలిపోనుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?