
వైసీపీ నుంచి గెంటివేతకు గురైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి గట్టి షాక్ తగిలింది. కోటంరెడ్డితో పాటు టీడీపీకి మద్దతు ఇచ్చిన నెల్లూరు నగర మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ మళ్లీ మాతృపార్టీ వైపు అడుగులు వేయడం విశేషం. నెల్లూరు నగరంలోని 12వ డివిజన్ నుంచి స్రవంతి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నెల్లూరు నగర మేయర్ పదవి ఎస్టీకి రిజర్వ్ అయ్యింది.
ఎస్టీ తెగకు చెందిన స్రవంతిని మేయర్ పదవి వరించింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్గంగా ఆమె కొనసాగారు. కోటంరెడ్డి వైసీపీని వీడి, టీడీపీకి దగ్గరయ్యారు. నెల్లూరు మేయర్ కూడా కోటంరెడ్డిని రాజకీయంగా అనుసరించారు. మేయర్ భర్త టీడీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో మేయర్ వర్సెస్ వైసీపీ కార్పొరేటర్లు అన్నట్టుగా ఘర్షణ వాతావరణాన్ని ఇటీవల కాలంలో చూశాం.
ఈ నేపథ్యంలో కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్‌రెడ్డితో మేయర్ దంపతులకు విభేదాలొచ్చాయి. దీంతో మేయర్ దంపతులు ఇవాళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ, రూరల్ వైసీపీ ఇన్‌చార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి వ్యూహంలో భాగంగానే కోటంరెడ్డి నుంచి మేయర్ దంపతులను తమ వైపు తిప్పుకున్నట్టు సమాచారం.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా