Advertisement

Advertisement


Home > Politics - Andhra

గుండ పిండి అవుతున్న సిక్కోలు టీడీపీ!

గుండ పిండి అవుతున్న సిక్కోలు టీడీపీ!

శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ జెండా నాలుగు దశాబ్దాలుగా పట్టుకున్న ప్రముఖ రాజకీయ కుటుంబానికి టీడీపీ హై కమాండ్ షాక్ ఇచ్చేసింది. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యానారాయణ సతీమణి గుండ లక్ష్మీదేవికి ఈసారి శ్రీకాకుళం సీటు లేకుండా పోయింది.

జిల్లాలోని కొందరు పెద్దల పుణ్యమే ఇదంతా అంటూ టీడీపీ తమ్ముళ్ళు మండిపడుతున్నారు. అధినాయకత్వం మీద నిప్పులు చెరిగారు. నిజాయతీగా ఉంటే ఇచ్చే బహుమానం ఇదేనా అని వారు నిలదీశారు. జిల్లా టీడీపీలో గుండ కుటుంబం కంటే సీనియర్లు ఎవరు ఉన్నారు అని వారు ప్రశ్నిస్తున్నారు.

టీడీపీ నుంచి గుండ కుటుంబం బయటకు రావాలని డిమాండ్ ఊపందుకుంది. గుండ అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం ఎంపీగా గుండ లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్లుగా  పోటీ చేస్తే గుండెలలో పెట్టి గెలిపించుకుంటామని వారు అనుచరులు అభిమానులు అంటున్నారు.

మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అయితే కళ్ల నీళ్లు పర్యంతం అయ్యారు. తనను స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని మంచివాడిని అని పిలిచి టికెట్ ఇచ్చారని గతాన్ని గుర్తు చేసుకున్నారు. డబ్బు ఉన్న వారికే టికెట్లు ఇస్తారా అని గుండ కుటుంబం మండిపడుతోంది.

శ్రీకాకుళం సీటుని గోండు శంకర్ కి కేటాయించారు. దాంతో ఈ సీటు ధర్మాన ప్రసాదరావుదే అని అంటున్నారు. ఆయన ధీమాగా ఉండొచ్చు అని అంటున్నారు. ధర్మానను ఓడించే సత్తా ఉన్న గుండా కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజా బలం లేని వారికి టికెట్ ఇచ్చారని గుండ అనుచరులు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి చెడ్డ కాలం వచ్చిందని  శాపనార్ధాలు పెడుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?