Advertisement

Advertisement


Home > Politics - Andhra

మార్పులతో టీడీపీకి కొత్త రెబెల్స్ ?

మార్పులతో టీడీపీకి కొత్త రెబెల్స్ ?

నామినేషన్ల పర్వం ఏపీలో సాగుతున్న వేళ టీడీపీ ఇంకా మార్పు చేర్పులు చేస్తూ పోతోంది. కొన్ని సీట్లలో నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్న వారిని పక్కన పెట్టి కొత్తవారికి టికెట్లు ఇస్తోంది. దాంతో నెల రోజులుగా జనంలో కాలిగి బలపం కట్టుకుని తిరిగిన వారు మండి పోతున్నారు.

మాకు ఇలా ఆశలు పెట్టి చివరికి షాక్ ఇస్తారా అంటూ వారు ఒక్క లెక్కన ఫైర్ అవుతున్నారు. నిజానికి సీటు లేదు అంటే అది ఒక లెక్క. కానీ సీటు మీదే అని చెప్పి టికెట్ ని ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో జనంలో వారు తిరిగేసి తామే అభ్యర్ధి అని ఊరూ వాడా చెప్పుకున్నాక తూచ్ మీరు కాదు అని తీసి పక్కన పెట్టడం అంటే అంతకు మించిన ఘోర అవమానం వేరొకటి ఉంటుందా అని వాపోతున్నారు.

టికెట్ ఇచ్చారని నామినేషన్లు కూడా వేసి వచ్చారు. అలా మాడుగుల నుంచి ఎన్నారై పైలా ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ బీఫారం పెందుర్తికి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి దక్కింది.

దాంతో అందరి చూపూ పైలా మీద పడుతోంది. ఆయనకంటూ బలమైన వర్గం ఉంది. ఆయన రెబెల్ అయితే గండమే అంటున్నారు. పాడేరులో అదే పరిస్థితి. అక్కడ రమేష్ నాయుడికి చాలా ముందుగానే టీడీపీ టికెట్ ప్రకటించింది. ఆయన నామినేషన్ వేశారు. తీరా అంతా అయ్యాక గిడ్డి ఈశ్వరికి టికెట్ అని అనౌన్స్ చేశారు. ఆమె బీఫారం తో వచ్చారు. రమేష్ నాయుడు అయితే పోటీకి రెడీ తగ్గేదేలే అంటున్నారు.

ఇలాంటివి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. దీని వల్ల టీడీపీ సాధించింది ఏమిటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మార్పుల వల్ల కొత్త రెబెల్స్ ని తయారు చేసుకుంటున్నారు అని అంటున్నారు. రెబెల్స్ కన్నెర్ర చేస్తే ఏమవుతుందో అన్న కంగారు అయితే సర్వత్రా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?