
ప్రముఖ సింగర్, రాయలసీమ ముద్దుబిడ్డ మంగ్లీపై టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ ...చివరికి తననే అభాసుపాలు చేసింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీ ఆధ్వర్యంలో హిందూ మత ప్రచారం నిమిత్తం నడుస్తున్న శ్రీవేంకటేశ్వర భక్తిచానల్‌కు సలహాదారుగా మంగ్లీని నియమించడాన్ని టీడీపీ తప్పు పడుతూ, ఆమెపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పాటలు పాడిన మంగ్లీ రుణాన్ని తీర్చుకునేందుకే ఎస్వీబీసీ చానల్‌లో పదవి ఇచ్చారంటూ టీడీపీ సోషల్ మీడియా విమర్శలకు దిగింది. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై మంగ్లీ కొన్ని పాటలు పాడింది. అందులో ప్రముఖంగా "రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న... నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా" అంటూ ఆమె పాడిన పాట తెలుగు సమాజాన్ని ఓ ఊపు ఊపింది.
అప్పట్లో జగన్ ప్రచార సభల్లో వెల్లువెత్తిన జనంలో ఈ పాట పూనకం నింపింది. ఇప్పటికీ ఈ పాట ప్రతి ఒక్కరిలో వైబ్రేషన్స్ పుట్టిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. బహుశా జగన్‌కు ఊపు, చంద్రబాబుకు డ్యామేజీ కలిగించడానికి మంగ్లీ స్వరమే కారణమనే భావనతో ఆమెకు పదవి రావడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగ్లీకి ఎస్వీబీసీలో సలహాదారు పదవి ఇవ్వడాన్ని టార్గెట్ చేయడానికి టీడీపీ సోషల్ మీడియా తీవ్ర ప్రయత్నం చేసింది.
అయితే మంగ్లీని టార్గెట్ చేయడాన్ని వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్‌గా తిప్పికొట్టంది. గతంలో ఇదే ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పదవిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు కట్టబెట్టడాన్ని గుర్తు చేస్తూ... ఓ రేంజ్‌లో టీడీపీ మొహం వాచిపోయేలా కౌంటర్లు పడ్డాయి. హీరోయిన్ల బొడ్లపై పండ్లు జాలువారించడంలో రాఘవేంద్రరావుకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉండడాన్ని గుర్తు చేస్తూ, టీడీపీని నెటిజన్లు కుళ్లపొడిచారు. మహిళల అంగాంగ ప్రదర్శనలతో రక్తి దర్శకుడిగా గుర్తింపు పొందిన రాఘవేంద్రరావు ఏం చేస్తారని భక్తి చానల్ చైర్మన్‌గా నియమించారంటూ నెటిజన్లు ఎదురు దాడికి దిగారు.
రాఘవేంద్రరావును ఏకంగా టీటీడీ చైర్మన్‌గా నియమిస్తే తప్పులేదు, కానీ రాయలసీమకు చెందిన ఓ గిరిజన బిడ్డను సలహాదారుగా నియమిస్తే నేరమైందా? అంటూ సోషల్ మీడియాలో నిలదీతలు వెల్లువెత్తాయి. దీంతో టీడీపీ సోషల్ మీడియా వద్ద కౌంటర్లు ఇవ్వడానికి సమాధానం దొరక్క చేతులెత్తేసింది. మంగ్లీని అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వంపై తూటా పేల్చాలనుకున్న టీడీపీ ప్రయత్నం మిస్ ఫైర్ అయ్యింది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా