Advertisement

Advertisement


Home > Politics - National

తప్పిన పెనుప్రమాదం.. ఢిల్లీలో కంచె దాటిన హిప్పో

తప్పిన పెనుప్రమాదం.. ఢిల్లీలో కంచె దాటిన హిప్పో

కంచె లోపల ఉండాల్సిన జంతువు, కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? ఎన్ క్లోజర్ లో చూసి ఆనందించే జంతువు, ఎలాంటి అడ్డంకి లేకుండా మన ముందుకొస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అలాంటి ఘటనే ఢిల్లీ జూలో జరిగింది. నీటిలో ఉండాల్సిన నీటి ఏనుగు (హిప్పోపోటమాస్) కంచె దాటుకొని రోడ్డుపైకి వచ్చే ప్రయత్నం చేసింది. ఢిల్లీ జూలో జరిగింది ఈ ఘటన.

ఈ భూమిపై ఉంటే అత్యంత భారీ జంతువుల్లో హిప్పో ఒకటి. అలాంటి భారీ జంతువు ఢిల్లీ జూలో కంచె దాటి బయటకొచ్చే ప్రయత్నం చేసింది. దీంతో సందర్శకులు ఒక్క క్షణం పాటు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే దగ్గర్లోనే ఉన్న సెక్యూరిటీ గార్డు చేసిన పని, సందర్శకుల్ని మరింత భయపెట్టింది.

కంచె దాటి రోడ్డుపైకొస్తున్న హిప్పోను తన చేతితో అదిలించే ప్రయత్నం చేశాడు సెక్యూరిటీ గార్డు. ముఖంపై కొట్టి, దాన్ని వెనక్కు పంపించడానికి ప్రయత్నించాడు. అలా చేసిన ప్రతిసారి హిప్పో కోపంతో తన నోటిని తెరిచి, సెక్యూరిటీ గార్డు చేయి అందుకునే ప్రయత్నం చేసింది. ఈ సన్నివేశం చూసిన వాళ్లు భయాందోళనకు గురయ్యారు.

మొత్తానికి సెక్యూరిటీ గార్డు మాత్రం తను అనుకున్నది సాధించాడు. ఒంటి చేత్తో అంత పెద్ద నీటిఏనుగును తిరిగి నీటిలోకి పంపించగలిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరైన కంచె ఏర్పాటుచేయకుండా అంతపెద్ద జంతువును జూలో ఎలా ఉంచారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వీడియో ఎప్పటిదనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?