
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడెప్పుడు బయటికొస్తారా? అని ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పట్లో బెయిల్ రాదనే అనుమానాన్ని టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా వుండగా ఇవాళ చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్‌లో కలుసుకున్నారు. ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటులో స్పీకర్‌గా యనమల కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో తన వాదన వినిపించడానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ వేడుకున్నా, స్పీకర్ స్థానంలో ఉన్న యనమల తిరస్కరించి చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు. అప్పటి నుంచి చంద్రబాబుకు నీడలా యనమల వుంటున్న సంగతి తెలిసిందే.
కుటుంబ సభ్యులు కాకుండా బాబును ములాఖత్‌లో కలుసుకున్న మొదటి టీడీపీ నాయకుడు యనమల కావడం విశేషం. జనసేనాని పవన్‌కల్యాణ్ కలయిక ప్రత్యేకం. చంద్రబాబును కలిసిన తర్వాత యనమల మీడియాతో మాట్లాడారు. జైలులో చంద్రబాబు సంతోషంగా లేరని యనమల ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. బాబు ఏ తప్పూ చేయలేదన్నారు. తప్పులు చేసిన వాళ్లే చంద్రబాబును జైల్లో వేశారని జగన్‌పై పరోక్ష విమర్శ చేశారు.
చంద్రబాబు గదిలో ఏసీ లేదన్నారు. ఆ సౌకర్యాన్ని కల్పించాలని జైలు అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు యనమల చెప్పుకొచ్చారు. గదిలో దోమలున్నట్టు యనమల తెలిపారు. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నట్టు ఆయన తెలిపారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా