Advertisement

Advertisement


Home > Politics - Andhra

90శాతం ఓట్లతో విజయాలు.. ఇంకా నోరెత్తుతారా?

90శాతం ఓట్లతో విజయాలు.. ఇంకా నోరెత్తుతారా?

జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ క్షణంలో ఎన్నికలు జరిగినా సరే.. తెలుగుదేశం పార్టీ 150 సీట్లతో అధికారంలోకి వస్తుంది. జనసేనతో పొత్తు పెట్టుకోవడం అనేది కేవలం లాంఛనం మాత్రమే. అంతే తప్ప.. ఒంటరిగా నెగ్గలేం అనే భయంతో కాదు.. ఈ తరహా మాటలు రాజకీయ వర్గాల్లో చాలా తరచుగా వినిపిస్తుంటాయి. 

తెలుగుదేశం వందిమాగధులు పదేపదే ఈ పాటలు పాడుతుంటారు. మరి రాష్ట్రంలో నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. ఆ నాలుగింటిని, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఓట్లతో గెలుచుకున్నది. దీనిపై వారేం అంటారు. స్థానిక సంస్థల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కే బలం ఉన్నది. అదంతా పెద్ద మాయ అని అనడం చాలా సులువు. 

కానీ స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు.. అధికార వైకాపా అనేక అక్రమాలకు పాల్పడిందని, ఇతర పార్టీలకు చెందిన వాళ్లు గెలిచినా కూడా వాళ్లందరినీ బెదిరించి, ప్రలోభపెట్టి తమ పార్టీ కండువా కప్పేసుకున్నారని అనేక రకాల ప్రచారాలు చేశారు. మరి గెలిచిన స్థానిక సంస్థల వారంతా ఇలా ఇతరపార్టీల వాళ్లయితే మరి వైఎస్సార్ కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో 90 శాతం ఓట్లు ఎలా వచ్చాయి.

ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. ఎన్నికలకు ముందు వరకు స్థానిక సంస్థల ప్రతినిధుల విషయంలో విపక్షాలు అనేకానేక కుట్రపూరిత ప్రచారాలు సాగించాయి. గ్రామపంచాయతీలకు వచ్చే సొమ్ములు మొత్తం జగన్ తినేశాడని, సర్పంచుల్లో ప్రభుత్వం పట్ల భయంకరమైన వ్యతిరేకత వెల్లువెత్తుతోందని రకరకాల ప్రచారాలు చేశారు. 

ఒకరిద్దరు సర్పంచులు తెలుగుదేశంలో చేరగానే.. వాటిని పతాకశీర్షికల్లో ప్రచురించి.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభ సన్నగిల్లిపోతున్నట్టుగా అనేక ప్రచారాలు సాగించారు. సర్పంచులు మండిపడుతున్నారని అనేకానేక రాతలు రాశారు. మరి ఎన్నికలు వచ్చేసరికి ఆ వ్యతిరేకత అంతా ఎక్కడకు పోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ కు 90 శాతం ఓట్లు ఎలా వచ్చాయి. 

రాష్ట్రంలో నాలుగు స్థానిక ఎమ్మెల్సీ స్థానాలను అధికార పార్టీ బీభత్సమైన మెజారిటీతో గెలుచుకుంది. తాము ఓడిపోయాం గనుక.. ఇవి అసలు ఎన్నికలే కాదని తోసిపుచ్చేసి ఆత్మవంచన చేసుకుని బతికితే ఎవ్వరూ ఏమీ చేయలేరు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని గ్రహిస్తే.. కనీసం వారి పనితీరును ఇంకాస్త మెరుగుపరచుకుంటారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?