టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి మహబుబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి రెడ్డి గెలుపొందారు.
సుమారు 1,150 ఓట్ల తేడాతో సమీప పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిపై విజయం సాధించారు. శుక్రవారం తెల్లవారుజామున వరకు ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ దక్కకపోవడంతో… రెండో ప్రాధ్యాన్యత ఓట్లను లెక్కించారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు బరిలో దిగారు. పోటీ మాత్రం పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి, పీఆర్టీయూటీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి మధ్య ఉండగా.. చెన్నకేశవరెడ్డికి సర్కారు పెద్దలు మద్దతు ఇచ్చారు. మరోపక్క బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి తరఫున బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.