కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, విచారణపై స్టే ఇవ్వాలని ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
వివేక హత్య కేసులో సీబీఐ విచారణకు సహకరించాలని సూచించింది. అరెస్టు చేయొద్దని సీబీఐని తాము ఆదేశించలేమని సృష్టం చేసింది. అయితే అవినాష్ రెడ్డి కోరుకున్నట్లు న్యాయవాది సమక్షంలో విచారణను వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని అధికారులను ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ నాలుగు సార్లు విచారణ జరిపింది. మరోవైపు కేవలం ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని .. ఈ హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయన్నాయని.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు అవినాశ్ రెడ్డి.