Advertisement

Advertisement


Home > Movies - Movie News

డ్యామేజీ కంట్రోల్.. కవర్ చేసిన కాలభైరవ

డ్యామేజీ కంట్రోల్.. కవర్ చేసిన కాలభైరవ

ఆస్కార్ వేదికపై అవార్డ్ అందుకున్న సందర్భంగా కీరవాణి హీరోల పేర్లు ప్రస్తావించలేదు. ఓ పాట మాత్రం పాడాడు. అందులో రాజమౌళి అండ్ మై ఫ్యామిలీ అనే మాత్రమే సంభోదించాడు. పాట పూర్తయిన తర్వాత కూడా చరణ్-తారక్ పేర్లు ప్రస్తావించలేదు. పైపెచ్చు థ్యాంక్ యు కార్తికేయ అన్నాడు.

ఇలా క్రెడిట్ మొత్తాన్ని కీరవాణి-రాజమౌళి కుటుంబ సభ్యులు అందుకునే ప్రయత్నం చేశారని, ఆస్కార్ వేదికపై తమ హీరోల పేర్లు ప్రకటించకపోవడం బాధాకరమంటూ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాపై ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ ఆక్రోషంపై ఇంకాస్త పెట్రోల్ వేసి మరింత మంట రగిల్చాడు సింగర్ కాలభైరవ.

తను పాడిన నాటు-నాటు పాటకు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు రావడంతో, ఓ పోస్ట్ వేశాడు కాలభైరవ. ఆస్కార్ వేదికపై కీరవాణి చేసినట్టే, ఈసారి కూడా కాలభైవర రాజమౌళి-కీరవాణికి, తన ఇతర కుటుంబ సభ్యులకు క్రెడిట్ ఇచ్చాడు. చరణ్-తారక్ పేర్లు ప్రస్తావించలేదు.

దీంతో చరణ్-తారక్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. వాళ్లిద్దరూ అంతబాగా డాన్స్ చేయకపోతే ఆ పాటకు గుర్తింపు వచ్చి ఉండేది కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. నిజానికి నాటు-నాటు కంటే మంచి పాటల్ని కీరవాణి కంపోజ్ చేశారని, కేవలం హీరోలు, ప్రేమ్ రక్షిత్ వల్ల ఆ పాట అంత పాపులర్ అయిందని మరికొందరన్నారు. సో.. వాళ్లకు క్రెడిట్ ఇవ్వకుండా, తన కుటుంబ సభ్యులకు కాలభైరవ థ్యాంక్స్ చెప్పడం బాగాలేదన్నారు చాలామంది.

తనపై భారీ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న వెంటనే కాలభైరవ రియాక్ట్ అయ్యారు. "నాటు-నాటు పాట, ఆర్ఆర్ఆర్ సినిమా ఇంత హిట్టవ్వడానికి కచ్చితంగా చరణ్ అన్న, తారక్ అన్న కూడా కారణం. అకాడమీ స్టేజ్ పెర్ఫార్మెన్స్ కోసం తనకు సహకరించిన వాళ్ల గురించి మాత్రమే నేను పోస్టులో మాట్లాడాను. నా మాటల్ని మరో విధంగా అర్థం చేసుకున్నారు. నా పదాల ఎంపికపై సిన్సియర్ గా క్షమాపణలు చెబుతున్నాను."

ఇలా తన పోస్ట్ ను సమర్థించుకుంటూనే, తారక్-చరణ్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాడు కాలభైరవ. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కీరవాణి-కాలభైరవ ఇద్దరూ తమ బుద్ధి చూపించుకున్నారని, ఆర్ఆర్ఆర్ క్రెడిట్ ను తమ కుటుంబానికి మాత్రమే ఆపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?