Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన సింగ‌ర్!

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన సింగ‌ర్!

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త‌ర్వాత‌ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విజ‌యంపై హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య ర‌చ్చ మాములుగా జ‌ర‌గ‌లేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ట్వీట్ట‌ర్ లో ట్రోల్ చేసుకున్నారు. అదే సంద‌ర్భంలో ఆస్కార్ వేదిక‌పై పాట పాడిన సింగ‌ర్ కాల‌భైర‌వ త‌మ హీరోల పేర్లు ప్ర‌స్తావించ‌లేద‌ని ఇద్ద‌రి హీరోలు క‌లిసి కాల‌భైర‌వ‌పై ట్వీట్ట‌ర్ వేదిక‌గా విరుచుప‌డ్డారు.

కాల‌భైర‌వ ట్వీట్ట‌ర్ వేదిక‌గా... ఆస్కార్ స్టేజీపై పాట పాడే అవ‌కాశానికి రాజ‌మౌళి, కీర‌వాణి, ప్రేమ్, కార్తికేయ కార‌ణ‌మంటూ ట్వీట్ చేశారు. దాంతో అందులో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ పేర్లు చెప్ప‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ ఫైర‌య్యారు. మా హీరోల పేర్లు ఎందుకు పెట్టాలేదంటూ మండిప‌డ్డారు. దానికి.. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కు సింగ‌ర్ కాల‌భైర‌వ క్ష‌మ‌ప‌ణ‌లు చెప్పారు. 

దీంతో కాల‌భైర‌వ స్పంధిస్తూ.. ఆర్ఆర్ఆర్ విజయానికి తారక్‌ అన్న, చరణ్‌ అన్నలే కారణం. ఆస్కార్ స్టేజీపై పాట పాడ‌టానికి స‌హ‌క‌రించిన వారి పేర్ల‌నే మాత్రమే నేను ప్ర‌స్తావించాను. ఇది త‌ప్పుగా వెళ్లినందుకు సారీ చెబుతున్నాంటూ ట్వీట్ చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?