Advertisement

Advertisement


Home > Politics - Andhra

వాలంటీర్లూ...భద్రం బీ కేర్ ఫుల్

వాలంటీర్లూ...భద్రం బీ కేర్ ఫుల్

వాలంటీర్లకు జాగ్రత్తలను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నేతలు చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ అన్నది జగన్ మానస పుత్రిక. ఆయన ఆలోచన అది. జగన్ అన్న నాయకుడు సీఎం కాకపోతే ఈ వ్యవస్థ అన్నది పుట్టేదే కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల వాలంటీర్లకు వందనం సభలో ముఖ్యమంత్రి జగన్ తాను ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థను ఎంతలా టీడీపీ నేతలు నిందించారో గుర్తు చేశారు.

వైసీపీ నేతలూ అదే అంటున్నారు. వాలంటీర్ల పట్ల తెలుగుదేశానికి ప్రేమ ఎందుకు ఉంటుందని, జన్మభూమి కమిటీలనే ఆ పార్తీ వస్తే తిరిగి ఏర్పాటు చేస్తారని హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలికి చెందిన ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఇదే మాట అంటూ వాలంటీర్ల భవిష్యత్తు బంగారంగా మారాలన్నా ఇంతకు మరింత ఆ వ్యవస్థకు మేలు జరగాలన్నా జగన్ మళ్లీ సీఎం కావాల్సిందే అని స్పష్టం చేశారు.

జగన్ సీఎం అయితే వాలంటీర్ల వ్యవస్థకు మరింత ఉజ్వల భవిష్యత్తు కూడా దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న వాలంటీర్లు నిజంగా గ్రేట్ అని ఎమ్మెల్యే కీర్తించారు. వారు చేస్తున్న కృషి వల్లనే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలలోకి వెళ్తున్నాయని అన్నారు.

వాలంటీర్ల వ్యవస్థను ఇంకా సమున్నత స్థితికి తీసుకెళ్ళే సత్తా జగన్ కి ఉందని అన్నారు జగన్ మళ్ళీ సీఎం అవుతారని, వాలంటీర్లకు ఇంక మంచి రోజులు వస్తాయని ఎమ్మెల్యే జోస్యం చెప్పారు వాలంటీర్లు మాత్రం బహు పరాక్ అన్నట్లుగా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అంటే జగన్ ప్రభుత్వం తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ పదిలంగా పదికాలాలు ఉండాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి. ఈ విషయంలో రెండవ మాట లేదనే వైసీపీ నేతలు చెబుతున్నారు.

వాలంటీర్ల వ్యవస్థను తాను కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు చెబుతున్నప్పటికీ నమ్మవద్దు అన్నదే వైసీపీ నేతలు ఇస్తున్న సందేశం. రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వీరంతా ఇపుడు కీలకంగా మారనున్నారని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?