
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వైసీపీకి సంతృప్తికరంగా సాగింది. ఇదే సందర్భంలో వైఎస్ జగన్ ప్రతి కదలికను ప్రత్యర్థులు, ఎల్లో మీడియా జాగ్రత్తగా గమనించడం విశేషం. ముఖ్యంగా నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్ జగన్‌కు ఎలాంటి ప్రాధాన్యం దక్కిందనే అంశంపై పచ్చ బ్యాచ్ దృష్టి సారించింది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభ వేడుకలో కూడా జగన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీకే మిశ్రా మాట్లాడ్డంపై అనుమానం రేకెత్తేలా ఎల్లో మీడియా తన వంతు విష ప్రచారాన్ని చేసింది. ఎక్కడో దూరాన ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి మిశ్రా లేచి వచ్చి జగన్‌తో మాట్లాడ్డారని ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.
ఇద్దరూ ఏకాంతంగా ఐదు నిమిషాలు మాట్లాడారని ఈనాడు తోక పత్రిక అత్యుత్సాహంతో తన మార్క్ కథనాన్ని వండివార్చింది. ఇటీవల జస్టిస్ మిశ్రా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వుంటూ ప్రమోషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పీకే మిశ్రా వచ్చిన తర్వాతే... జగన్ సర్కార్, న్యాయ వ్యవస్థ మధ్య సానుకూల సంబంధాలు ఏర్పడ్డాయి. అంతకు ముందు తన ప్రభుత్వంపై న్యాయ వ్యవస్థలోని కొందరు వ్యక్తులు కక్షతో వ్యవహరిస్తున్నారని సీఎం జగన్ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
జస్టిస్ మిశ్రా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతా న్యాయబద్ధంగా సాగుతోందన్న భావన కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో సీఎం వద్దకే సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో ఆయన రావడం విశేషం. ఇది కొందరికి జీర్ణించుకోలేకుండా తయారైంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా