Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఫాల్గుణ కృష్ణ విదియ.. అందరికీ ఆ రోజే కావాలి!

ఫాల్గుణ కృష్ణ విదియ.. అందరికీ ఆ రోజే కావాలి!

ఏదైనా మంచి పని చేయాలంటే మంచి రోజు చూసుకుని ప్రారంభించడం మనకు అలవాటు. అలాంటిది కోటి ఆశలతో ఒక రాష్ట్రాన్ని అయిదేళ్ల పాటూ పరిపాలించే అవకాశం దక్కాలని కోరుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేప్పుడు ఇంకా ఎంత మంచి ముహూర్తాలు చూసుకుంటారో కదా?

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటి దాకా ఓట్ లకోసమే ఎన్నెన్ని సభలు నిర్వహించినప్పటికీ.. ఎన్నికల ప్రచారం రూపేణా అధికారిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా ప్రారంభించాలని పార్టీలు అనుకుంటాయి. ఈ క్రమంలోనే.. ఈనెల 27వ తేదీ.. ఫాల్గుణ కృష్ణ విదియ తిథి బుధవారం రోజును పార్టీలు శుభకరమైన రోజుగా భావిస్తున్నాయి. తమాషా ఏంటంటే.. అధికారం కోసం తలపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం రెండు పార్టీలు కూడా.. అదే రోజును ఎంచుకోవడం!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిమిత్తం నిర్వహించే బస్సుయాత్రను 27వ తేదీన ప్రారంభించబోతున్నారు. ఆ రోజున ఇడుపుల పాయలో వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన బస్సు యాత్ర ప్రారొంభిస్తారు. అదేరోజున అంటే 27వ తేదీనే చంద్రబాబునాయుడు కూడా ప్రజాగళం పేరుతో తన ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుడతారు. చంద్రబాబు చిత్తూరుజిల్లాలో తన సభలను ప్రారంభిస్తారు. తొలిరోజున పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు జరుగుతాయి.

మంచి రోజులు చూసుకోవడం అనేది పార్టీలకు తప్పనిసరి వ్యవహారమే కావొచ్చు గాక. అది మంచి రోజే. ఎవరికి మంచి చేస్తుంది? అనేది ఇక్కడ కీలకం. ఒకే అధికారాన్ని ఆశిస్తున్న ఇద్దరూ ఒకేరోజున ప్రచారం ప్రారంభిస్తున్నప్పుడు.. ఎవరో ఒక్కరే కదా గెలుస్తారు. ఓడిపోయిన పార్టీకి ఆ శుభముహూర్తం చెడు చేసినట్టే కదా! అనే తరహా తర్కం ప్రజల్లో వినిపిస్తోంది.

మంచి చెడు ముహూర్తాల సంగతి పక్కన పెట్టి.. ఎన్నికల ప్రచారంలో ప్రజల హృదయాలను గెలుచుకోవడం, వారి నమ్మకాన్ని పొందడం ఎలాగో నాయకులు శ్రద్ధ పెట్టాలని ప్రజలు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?