Advertisement

Advertisement


Home > Politics - Andhra

మే 13న తుపాను... కొట్టుకుపోయేది ఎవరు?

మే 13న తుపాను... కొట్టుకుపోయేది ఎవరు?

ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. ఏపీ దశను దిశను మార్చే ఎన్నికలు జరగబోతున్నాయి. విభజన ఆంధ్రలో రెండవసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలలో గెలుపు కోసం అధికార వైసీపీ విపక్ష టీడీపీ హోరాహోరీ పోరాడుతున్నాయి.

ఈ ఎన్నికలకు పార్టీల అధి నాయకులు పెడుతున్న పేర్లు సంచలనం గానే ఉన్నాయి. సునామీ అంటారు తుఫాను అంటారు. భూకంపం అంటారు, కురుక్షేత్ర యుద్ధం అంటున్నారు. చంద్రబాబు అయితే విజయనగరం జిల్లాలో జరిగిన ప్రజాగళం సభలో తుఫాను అని రాజకీయ వాతావరణ సూచన ఇచ్చేశారు.

ఇప్పటి వరకు ఎన్నో తుపాన్లు చూశామని మే 13న రాబోయే తుపానులో వైసీపీ కొట్టుకుపోయి బంగాళాఖాతంలో కలిసిపోవాలని టీడీపీ అధినేత అంటున్నారు. అంతే కాదు రాష్ట్రంలో ప్రతి చోటా వైసీపీ ఓడిపోవాలి అనే నినాదమే వినిపిస్తోందన్నారు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరవైందన్నారు. రాష్ట్రంలో చట్టం లేదు. న్యాయం లేదని అన్నారు. జగన్‌ ఓ సైకో అన్నారు. ఈ ప్రభుత్వంలో రాష్ట్రమంతా గంజాయి, డ్రగ్స్, చీప్ లిక్కర్ మయమైపోయిందని నిప్ప్పులు కక్కారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అని జగన్ ని దుమ్మెత్తి పోశారు.

ఇలా చంద్రబాబు తన ప్రసంగం మొత్తం జగన్ మీదనే విమర్శలు చేస్తూ పోయారు. మే 13న్ తుఫాను అని చివరికి తేల్చారు. ఆయన చెప్పినట్లుగా మే 13న రాజకీయ తుఫాను రావడం ఖాయమే. అయితే అ తుఫానులో కొట్టుకుపోయేది వైసీపీ అని బాబు ఆశపడుతున్నారు కానీ టీడీపీనే అని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. బాబు మనసులో మాటను జనాల ముందు చెప్పి సెల్ఫ్ హిప్నటైజ్ చేస్తున్నారని వైసీపీ పోవాలని అని ఆయన అంటున్నారని మే 13న తుఫాను ఎవరికి పొమ్మంటుందో వేచి చూద్దామని వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?