Advertisement

Advertisement


Home > Politics - Andhra

వైసీపీ వ‌ద్ద‌నుకున్న ఎమ్మెల్యే.. బీజేపీకి ఎంపీ అభ్య‌ర్థి!

వైసీపీ వ‌ద్ద‌నుకున్న ఎమ్మెల్యే.. బీజేపీకి ఎంపీ అభ్య‌ర్థి!

ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త తెచ్చుకున్నార‌నే కార‌ణంతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌క్క‌న పెట్టిన ఎమ్మెల్యే... బీజేపీకి ఎంపీ అభ్య‌ర్థి కానున్నారు. తిరుప‌తి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెల‌గ‌ప‌ల్లి వ‌ర‌ప్ర‌సాద్ ఎట్ట‌కేల‌కు జాతీయ పార్టీ గొడుగు కింద చేరారు. ఇవాళ ఆయ‌న కేంద్ర‌మంత్రి అనురాగ్‌ఠాకూర్ స‌మ‌క్షంలో బీజేపీ కండువా క‌ప్పుకున్నారు.

గూడూరు సీటు ఇవ్వ‌ని నేప‌థ్యంలో వెల‌గ‌ప‌ల్లి వ‌ర‌ప్ర‌సాద్ జ‌న‌సేన‌, బీజేపీ చుట్టూ తిరిగారు. మొద‌ట ఆయ‌న ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌ద్ద‌కెళ్లారు. అయితే టికెట్‌పై ఆయ‌న‌కు హామీ ల‌భించ‌లేదు. అనంత‌రం రాజ‌కీయ స‌మీక‌ర‌ణలు మారాయి. టీడీపీ, బీజేపీ పొత్తు కుదుర్చుకోవ‌డంతో వ‌ర‌ప్ర‌సాద్‌కు ఓ ప‌రిష్కారం దొరికిన‌ట్టైంది. బీజేపీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుండ‌డం, అందులో తిరుప‌తి కూడా ఉండ‌డంతో వ‌ర‌ప్ర‌సాద్‌కు కొత్త ఆలోచ‌న క‌లిగింది.

2014 నుంచి ఆయ‌న తిరుప‌తి ఎంపీగా వైసీపీ నుంచి ప్రాతినిథ్యం వ‌హించారు. దీంతో ఆయ‌న తిరుప‌తి ఎంపీ సీటుపై క‌న్నేశారు. ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని క‌లుసుకున్నారు. త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టారు. వ‌ర‌ప్ర‌సాద్ అయితే తిరుప‌తి సీటుకు స‌రిపోతార‌ని ఆమె భావించారు.

ఈ విష‌యాన్ని కేంద్ర పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ కండువా క‌ప్పించారు. ఒక‌ట్రెండు రోజుల్లో బీజేపీ ప్ర‌క‌టించే జాబితాలో తిరుప‌తి అభ్య‌ర్థిగా వ‌ర‌ప్ర‌సాద్ పేరు రానుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. బీజేపీలో చేరిన రోజుల వ్య‌వ‌ధిలోనే టికెట్ ద‌క్కించుకోనుండ‌డం విశేషం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?