ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న టీడీపీ నేత దేవినేని ఉమ, కరోనా టెస్టుల గురించి మాట్లాడే కంటే ముందు తను ఆడో-మగో టెస్ట్ చేయించుకుంటే మంచిదంటూ ఘాటుగా విమర్శించారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్. ఆ ఉమాకు అసలు ఏం తెలుసో, తెలియదో భగవంతుడికే తెలియాలన్నారు అనీల్.
“కేసీఆర్ గారు చెప్పినట్టు అసలు ఉమ ఏదో ఆయన తెలుసుకోవాలి ఫస్ట్. ముందు ఆ టెస్ట్ చేయించుకోమనండి. ఆ ఉమాకు ఏం తెలుసో తెలియదో భగవంతుడికే ఎరుక. ఈ టీడీపీ నేతలంతా ఇళ్లల్లో కూర్చొని ఏడుస్తున్నారు. పేదలకు ఎలాంటి సాయం అందించకుండా ఇళ్లల్లో దాక్కున్నారు. ఉమకు తెలిసింది ఒకటే. గొంతేసుకొని వాగేయడం, ఇంటికి పోయి పడుకోవడం.”
అసలు ఇలాంటి నాయకుల్ని పెంచి పోషిస్తున్న చంద్రబాబుదే తప్పని విమర్శించారు అనీల్. కరోనా వస్తుందని తెలిసిన వెంటనే పొరుగు రాష్ట్రానికి పోయి దాక్కున్నారని, ఇలాంటి నేత ఏపీకి ప్రతిపక్ష నేతగా ఉండడం సిగ్గుచేటని అన్నారు.
“గతంలో ఒక వైరాలజీ ల్యాబ్ ఉంటే, కరోనా వచ్చిన తర్వాత 9 ల్యాబ్స్ పెట్టాం. దాదాపు 1200 వైద్యుల్ని నియమించాం. ఇలా అన్ని చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబుకు ఏమీ కనిపించవు. రాష్ట్రంలో ఇన్ని చర్యలు తీసుకుంటుంటే.. పోయి పక్క రాష్ట్రంలో నక్కి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని మినిమం కామన్ సెన్స్ లేని మనుషులతో ఇక్కడ మాట్లాడిస్తున్నాడు.”
హైదరాబాద్ లో దాక్కున్న చంద్రబాబు.. ఓవైపు ప్రభుత్వంపై చవకబారు విమర్శలు చేస్తూనే, మరోవైపు కొడుకు లోకేష్ కు సైకిల్ తొక్కడం నేర్పిస్తున్నారని ఎద్దేవా చేశారు అనీల్.