ఏపీలో 60కి చేరిన కరోనా మృతులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మృతుల సంఖ్య 60కు చేరింది. గడిచిన 24గంటల్లో కర్నూలులో కరోనా కారణంగా ఒకరి మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 60కు చేరినట్టు అధికారులు ప్రకటించారు. Advertisement నిన్న ఉదయం…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మృతుల సంఖ్య 60కు చేరింది. గడిచిన 24గంటల్లో కర్నూలులో కరోనా కారణంగా ఒకరి మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 60కు చేరినట్టు అధికారులు ప్రకటించారు.

నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు రికార్డ్ స్థాయిలో 11,638 శాంపిల్స్ ను పరీక్షించారు. వీటిలో 33 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2874కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురికి, నెల్లూరు నుంచి ఇద్దరికి కోయంబేడు మార్కెట్ తో కనెక్షన్ ఉన్నట్టు అధికారులు నిర్థారించారు.

ఇక డిశ్చార్జీల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 79 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2వేలు మార్క్ దాటింది. ప్రస్తుతం 777 మందికి వివిధ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు.

విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వాళ్లలో 111 మందికి పాజిటివ్ ఉన్నట్టు నిర్థారించారు. అటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 345 మందికి కరోనా ఉంది. వీళ్లలో 22 మంది ఈరోజు డిశ్చార్జ్ అవుతారు. 

మన పాలన-మీ సూచన, 5వ రోజు