అప్పులివ్వడంలో ఆంధ్రా లాస్ట్..!

ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పుల గురించి కదా ఇప్పుడంతా హాట్ డిస్కషన్, మరి ఆంధ్రా అప్పులివ్వడం ఏంటి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం. ఆంధ్రా అప్పులివ్వడంలో వెనకబడింది, దేశవ్యాప్తంగా చివరి స్థానం సంపాదించింది. Advertisement కరోనా లోన్లు…

ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పుల గురించి కదా ఇప్పుడంతా హాట్ డిస్కషన్, మరి ఆంధ్రా అప్పులివ్వడం ఏంటి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం. ఆంధ్రా అప్పులివ్వడంలో వెనకబడింది, దేశవ్యాప్తంగా చివరి స్థానం సంపాదించింది.

కరోనా లోన్లు అంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ బ్యాంక్ లు, ప్రైవేటు బ్యాంకులకు పలు ఆదేశాలిచ్చింది. కరోనా పాజిటివ్ ఉన్నవారికి చికిత్స కోసం పర్సనల్ లోన్లు ఇవ్వాలని సూచించింది. అవగాహన ఉన్నవారు లోన్లు తీసుకున్నారు, లేనివారు బయట అప్పులు తెచ్చి సతమతం అవుతున్నారు. ఈ క్రమంలో ఏయే రాష్ట్రాలు ఎంతమందికి కరోనా లోన్లు ఇచ్చాయనే సర్వే జరిగింది. దీంట్లో ఏపీ చిట్టచివరి స్థానంలో ఉంది. పొరుగు రాష్ట్రం తమిళనాడు మొదటి స్థానంలో ఉండటం గమనార్హం.

కరోనా చికిత్స కోసం ఉదారంగా లోన్లు ఇవ్వాలని, అవి అన్ సెక్యూర్డ్ రుణాలని కేంద్రం విస్పష్టంగా ప్రకటించింది. ఈమేరకు బ్యాంకులకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అయితే బ్యాంకులు మాత్రం ఈ లోన్ల విషయంలో కూడా సవాలక్ష కండిషన్లు పెట్టాయి. ముఖ్యంగా ఏపీలో రుణాల విషయంలో బ్యాంకులు మరీ దారుణంగా వ్యవహరించాయి. అందుకే ఏపీ ఈ లోన్ల మంజూరులో చివరి స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 1.33 లక్షల మంది కరోనా లోన్లు తీసుకున్నట్టు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. తమిళనాడులోని బ్యాంకులు 33,917మందికి లోన్లు ఇచ్చాయి. ఆ తర్వాతి స్థానం కర్నాటకది. అక్కడి బ్యాంకులు 20,391మందికి లోన్లు ఇచ్చాయి. ఇలా లెక్కేసుకుంటూ పోతే ఏపీ చివరి స్థానంలో ఉంది. ఏపీలో కేవలం 2,791మందికి మాత్రమే రుణాలు ఇచ్చారు. తెలంగాణలో లబ్ధిదారుల సంఖ్య 3,389. తెలుగు రాష్ట్రాలు రెండూ ఈ విషయంలో వెనకబడి ఉంటడం గమనార్హం.

కరోనా లోన్ల విషయంలో బ్యాంకులు పెద్దగా ప్రచారం చేయలేదు. కొంతమంది ఎలాగోలా తెలుసుకుని లోన్లకోసం వచ్చినా, వారికి సవాలక్ష కండిషన్లు పెడుతున్నాయి బ్యాంకులు. ఉద్యోగస్తుల విషయంలో మాత్రం ఉదారంగా ఉన్నాయి. కరోనా చికిత్సకోసం పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలయినా కేంద్రం ఆదుకోలేకపోయిం, కనీసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలన్నా అదీ కుదరలేదు. అదనపు వడ్డీ లేకుండా ఈఎంఐల వాయిదా ఒక్కటే కేంద్రం చేయగలిగింది. అంతకు మించి ఏమైనా చేయాలనుకున్నా బ్యాంకులు సహకరించడంలేదు