ఎన్నికల ఫలితాలతో ఫ్రస్టేషన్ లోకి వెళ్లిపోయిన చంద్రబాబుకి రోజు రోజుకీ అది పీక్స్ కు వెళ్లిపోయింది. దీంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు.
జగన్ ను సీఎంగా అంగీకరించడానికి ఆయన మనసు ఒప్పుకోవడం లేదు. అక్కడితో ఆగితే బాగుండేది. ఏకంగా ప్రజా విప్లవం రావాలంటూ బాబు పిలుపునివ్వడం కొత్త కామెడీ. ప్రజా విప్లవం వచ్చి, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడాలంట.
ప్రభుత్వాన్ని దారిలోకి తీసుకురావాలంట. అసలు ప్రజా విప్లవం వచ్చిందే బాబు జమానాలో. ఆ విప్లవ ఫలితాన్నే బాబు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ప్రజలు తమ ఓటుతో విప్లవం సృష్టించి బాబును ఓడించారు. ఓ మూలన కూర్చోబెట్టారు. కాబట్టి ప్రజావిప్లవం ఆల్రెడీ వచ్చేసింది.
ఇప్పుడంతా ప్రజా సంక్షేమమే. పోనీ ప్రజా విప్లవం రావాలంటున్న బాబు.. ఇప్పుడా అవసరం
ఎందుకో చెప్పడం లేదు. నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నందుకా..? చేనేత కార్మికులకు నేతన్న నేస్తం ఇచ్చినందుకా..? రైతు భరోసాతో అన్నదాతల్ని ఆదుకున్నందుకా..? మహిళల రుణాల వడ్డీ మాఫీ చేసినందుకా..? అమ్మఒడితో ఆదుకుంటున్నందుకా..?
ఇలా చెప్పుకుంటూ పోతే విప్లవం అవసరం లేదనడానికి సవాలక్ష కారణాలున్నాయి. కానీ బాబు కోరుకుంటున్న విప్లవానికి ఒక్క కారణాన్నయినా చెప్పగలరా? ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బాబు కోరుకుంటున్న మార్పే వస్తే, టీడీపీకి ఆ 23 సీట్లు కూడా దక్కవు. ఇది పక్కా.
మత రాజకీయాలను ఎగదోసినందుకు, ఇంగ్లిష్ మీడియాన్ని అడ్డుకున్నందుకు, ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డు పడుతున్నందుకు, మూడు రాజధానులతో జరిగే అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుగోడగా నిలిచినందుకు.. మరోసారి ప్రజావిప్లవం రావాల్సిందే. బాబును 23 నుంచి సింగిల్ డిజిట్ కు పరిమితం చేయాల్సిందే. ఆయన్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిందే.
వాస్తవానికి ఇంకా మూడున్నరేళ్లపాటు వేచి చూసే ఓపిక బాబులో లేదు, ఆయన ఆరోగ్యం 2024వరకూ సహకరిస్తుందన్న నమ్మకమూ లేదు, ఈలోగా కొడుకు ప్రయోజకుడు అవుతాడన్న ఆశ అసలు లేదు. అందుకే ఆయన తొందర పడుతున్నారు.
ఏదో ఒక రూపంలో ఎన్నికలు వచ్చేయాలని ఉబలాటపడుతున్నారు. అందుకో ఓ వైపు జమిలీ అంటూ, మరోవైపు ప్రజావిప్లవం రావాలంటూ కామెడీ చేస్తున్నారు.