అప్పుడు బ్లాక్‌ మెయిలర్‌.. ఇప్పుడు చీటర్‌.. రవిప్రకాష్‌!

'పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రిక..' అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఒక పత్రికను ఉద్దేశించి. ఎన్నో దశాబ్దాల కిందటే జర్నలిజం విలువలు బట్టకట్టిన అలాంటి సమయంలోనే మహాకవి ఆ మాట అన్నారు. మరి ఇప్పుడు మీడియా…

'పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రిక..' అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఒక పత్రికను ఉద్దేశించి. ఎన్నో దశాబ్దాల కిందటే జర్నలిజం విలువలు బట్టకట్టిన అలాంటి సమయంలోనే మహాకవి ఆ మాట అన్నారు. మరి ఇప్పుడు మీడియా పరిస్థితిని, రవిప్రకాష్‌ లాంటి వారితీరును చెప్పాలంటే.. మహాకవి మళ్లీపుట్టాలి. అంత కన్నా తీవ్రమైన భాష ప్రయోగాన్ని ఉపయోగించి ఖండించాలి. కత్తి కన్నా కలం పదునైనది అంటారు. ఈ కలం వీరులు సృష్టిస్తున్న కలకలాన్ని చెప్పాలంటే ఆ కలం పదునేచాలదు. పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన ఒక విషపు వ్యక్తి రవిప్రకాష్‌ అనడానకి ఏమాత్రం వెనుకాడనక్కర్లేదని అతడిని బాగా ఎరిగిన వాళ్లు ఇప్పుడు ధైర్యంగా చెబుతూ ఉన్నారు. నిర్లజ్జగా, నిర్మొహమాటంగా, నీఛంగా.. బతికిన వ్యక్తి రవిప్రకాష్‌ అని వారు అంటున్నారు.

టీవీనైన్‌ సీఈవో అనే హోదాలో ఉన్నంతసేపూ రవిప్రకాష్‌ అలా ఒక నికృష్టమైన వ్యక్తిత్వంతో డబ్బు సంపాదించేడమే ధ్యేయంగా ఎన్నో చీకటి పనులు చేసి, ఆఖరికి జర్నలిజం వృత్తికే మరకలు అంటించిన వ్యక్తి.. ఇవీ రవిప్రకాష్‌ గురించి ఇప్పుడు జర్నలిస్టిక్‌ సర్కిల్స్‌ నుంచి వినిపిస్తున్న అభిప్రాయాలు. తెరమీద కనిపించి నీతులు చెప్పే రవిప్రకాష్‌ వేరు, తెరవెనుక ఉంటూ బ్లాయి మెయిలింగే శ్వాసగా తీసుకునే రవిప్రకాష్‌ వేరు.. అని చాలామంది ఇన్నేళ్లూ ఆఫ్‌ ద రికార్డుగా చెప్పేవాళ్లు. చాలారకాల ఆఫ్‌ ద రికార్డు వార్తలను ప్రసారం చేసిన రవిప్రకాష్‌ గురించి ఆఫ్‌ ద రికార్డు మాటలు వినిపించడం వింత ఏమీకాదు. రవిప్రకాష్‌ గురించి చెప్పమంటే చాలామంది జర్నలిస్టులు, అతడిని బాగా ఎరిగిన వారు చెప్పేమాట అతడొక బ్లాక్‌ మెయిలర్‌ అనేది!

మీరు సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి అనుకుందాం. మీకు రవి ప్రకాష్‌తో ఏదో పరిచయం. లేదా అనుకోకుండా కలిశారు. పిచ్చాపాటిగా మాట్లాడారు. అలా మాట్లాడేటప్పుడు మీ ఇద్దరి కామన్‌ ఫ్రెండ్స్‌ గురించినో లేక రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తుల గురించి ఏదో కాస్త మాట్లాడేస్తారు. రవిప్రకాష్‌లో మీరొక ఫ్రెండ్‌ను మాత్రమే చూసి ఏదైనా మాట్లాడి ఉంటారు. అయితే అతడొక బ్లాక్‌ మెయిలర్‌. రవిప్రకాష్‌ దగ్గర మీరు మాట్లాడే ప్రతిమాటా రికార్డు అవుతూ ఉంటుందంటే అతడి తీరేమిటో అర్థం చేసుకోవచ్చని అతడి కన్నింగ్‌ మెంటాలిటీని ఎరిగినవాళ్లు చెబుతుంటారు. ప్రముఖుల దగ్గరకు వెళ్లినా, ప్రముఖులే అతడి దగ్గరకు వెళ్లినా రవిప్రకాష్‌ దగ్గర ఒక వాయిస్‌ రికార్డర్‌ రన్‌ అవుతూ ఉంటుందట. వాళ్లు ఏం మాట్లాడతారా, ఎక్కడ తనకు దొరుకుతారా, వారి మాటలను ఎలా ఎడిట్‌ చేసుకుని.. వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసుకోవాలా అనేదే రవిప్రకాష్‌ అజెండా అనేది దశాబ్దాలుగా అతడి తీరును గమనించిన వారు చెబుతూ ఉన్నమాట.

అవతల వాళ్ల స్థాయిని బట్టి రవిప్రకాష్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ ఉంటుంది. దీనికోసం ఒక ముఠాను నడుపుతూ ఉన్నాడట రవిప్రకాష్‌. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు జర్నలిజానికి పూర్తిస్థాయి కళంకాన్ని తెచ్చినవ్యక్తి రవిప్రకాష్‌ అనేది నిఖార్సైన జర్నలిస్టులు చెప్పేమాట. అప్పటివరకూ జర్నలిజం అంటే.. కొందరి వృత్తే. భాష మీద మంచి పట్టు ఉన్నవారు, రిపోర్టింగ్‌ సాహసాలు చేయాలనుకునే వారు, ఆ వృత్తి మీద ప్రేమ ఉన్న వారు జర్నలిస్టులుగా చేశారు. పాతతరం జర్నలిస్టులను గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. అయితే రవిప్రకాష్‌ లాంటివారు జర్నలిజం వృత్తినే మార్చేశారు. రాతను నమ్ముకునే ఈ వృత్తికి బ్లాక్‌ మెయిలింగ్‌ను, చీకటి దందాలను పరిచయం చేసిన వ్యక్తిగా రవిప్రకాష్‌ నిలిచిపోతాడని కొందరు జర్నలిస్టులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

'చూస్తూనే ఉండండి..' అంటూ టీవీ జర్నలిజాన్ని రవిప్రకాష్‌ గ్లామరస్‌గా మార్చాడనే అభిప్రాయాలుంటాయి. అయితే అది తెరపైకి కనిపించేది. తెరవెనుక జరిగేది మాత్రం వేరే కథ. టీవీ నైన్‌ను రవిప్రకాష్‌ ఒక రేంజ్‌లో ఉద్దరించింది కూడా ఏమీలేదు. అందుకు రుజువు ఏమిటంటే.. ఆ సంస్థ బ్రేక్‌ ఈవెన్‌ పొజిషన్‌కు వచ్చిందే ఇటీవల అని దాని పెట్టుబడిదారులు చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు రవిప్రకాష్‌ ఏ రకంగా ఒక సక్సెస్‌ఫుల్‌ సీఈవో అవుతాడనే ప్రశ్నలూ ఉత్పన్నం అవుతున్నాయి. టీవీనైన్‌ ప్రారంభం అయినది ఇప్పుడేమీకాదు. పదిహేనేళ్ల కిందకు ముందే ఆరంభం అయ్యింది. అప్పుడు పోటీనేలేదు. ఆ తర్వాత ఆరేడేళ్లకు అనేక ఇరవై నాలుగు గంటల వార్తా చానళ్లు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడంటే బోలెడంత పోటీ. ఇప్పుడు ఎవరైనా ప్రారంభిస్తే లాబాలు చూడటానికి సమయం పట్టవచ్చు.

అయితే పోటీలేని కాలంలో నవ్యంగా ప్రారంభం అయిన చానల్‌ చాలా సంవత్సరాల పాటు నష్టాలనే చూసిందంటే.. సీఈవోగా రవిప్రకాష్‌ సక్సెస్‌ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. టీవీ నైన్‌ పేరును అడ్డం పెట్టుకుని రవిప్రకాష్‌ బోలెడంత సంపాదించాడు. వాటితో ఆర్థిక నేరాలకు కూడా పాల్పడ్డాడు. తనకు అవసరమైనప్పుడల్లా అందరినీ బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ బతికేశాడు.. అని కొందరు జర్నలిస్టులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతేకానీ టీవీ నైన్‌కు సంస్థాగతంగా అతడు తెచ్చిపెట్టిన లాభాలు లేవని తెలుస్తోంది. అతడొక నికృష్టపు మనస్తత్వం కలిగిన వ్యక్తి అని ఇతర మీడియా వర్గాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు చెబుతూ ఉన్నారు. ఏదైనా కొత్తగా చానల్‌ ప్రారంభం అయ్యిందంటే.. అందులోకి టీవీ నైన్‌ నుంచి కొందరు ఉద్యోగులు అయినా వెళ్తారు.

ఫీల్డ్‌లోకి కొత్త చానల్‌ వచ్చినప్పుడల్లా టీవీ నైన్‌లో బాగా పేరు తెచ్చుకున్న వాళ్లు దాంట్లోకి వెళ్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకే వారు తిరిగి టీవీ నైన్‌కు వెళ్లిపోతారు! ఇప్పుడు టీవీ నైన్‌లో ఉన్నవాళ్లు కూడా.. కనీసం కొన్నినెలలు అయినా వేరే చానళ్లకు వెళ్లి వచ్చినవారే. ప్రత్యేకించి ఆ చానళ్లు ప్రారంభం కాగానే అలా జంపులు కొట్టి, కొన్ని నెలలకే మళ్లీ టీవీ నైన్‌లోకి వారంతా చేరిపోయి ఉంటారు! అలా ఎందుకు జరుగుతుంది? అంటే.. అదే రవిప్రకాష్‌ మార్కు బాసిజం అనిఅంటారు జర్నలిస్టులు. కొత్తగా వచ్చిన చానళ్ల ఆరంభంలోనే అందులోకి తన మనుషులను పంపడం, అక్కడ ఏం జరుగుతోంది అనే విషయాలను పూర్తిగా తెలుసుకోవడం, ఇక అవసరం తీరిపోయిందనుకున్నా వాళ్లను తిరిగి తన ఆధీనంలోని చానల్‌లోకి చేర్చుకోవడం. ఇదీ రవిప్రకాష్‌ మెంటాలిటీ. అనేది జర్నలిస్టులు చేసే విశ్లేషణ.

ఆఖరికి జగన్‌ మోహన్‌రెడ్డి 'సాక్షి'లో కూడా రవిప్రకాష్‌ సూడో జర్నలిస్టులు కొందరు వాలారు. కొన్నినెలల పాటు అక్కడ కీలక పొజిషన్లలో పనిచేశారు. ఆ తర్వాత వారు రవి ప్రకాష్‌ దగ్గరకు చేరిపోయారు! వారు ఏ గుట్లుముట్లను తెలుసుకుని వెళ్తారో కానీ.. రవి ప్రకాష్‌ మాత్రం ఇలా తన చేతిలోని కొందరు జర్నలిస్టులను అలా వాడుకుంటూ  ఉంటాడని మాత్రం స్పష్టం అవుతుంది. రవిప్రకాష్‌ ఆధీనంలోని చానల్లో ఒక కింది స్థాయిలో పనిచేసిన జర్నలిస్టు వెళ్లి అతడిని చెప్పుతో కొట్టాడంటే.. అతడి తీరేమిటో అర్థం చేసుకోవచ్చు.  ఏ మనిషినీ మరో మనిషి చెప్పుతో కొట్టే ఆవేశం అంత తేలికగా రాదు. ఒకవేళ ఆ ఆవేశంతో ఆ జర్నలిస్టు చేయకూడని పని చేశాడని అనుకుందాం.

అయితే  అతడిని మళ్లీ బెదిరించి, కొట్టి, తిట్టి.. తిరిగి కాళ్లు పట్టించుకున్న తత్వం రవిప్రకాష్‌ ది. చెప్పుతో కొట్టిన వ్యక్తిది ఆవేశం అనుకుందాం. మరి ఈ కాళ్లు పట్టించుకుని, దాన్ని వీడియోగా తీసి.. సోషల్‌ మీడియాకు విడుదల చేసిన వ్యక్తి మనస్తత్వాన్ని ఏమనాలో అర్థం చేసుకోవడం కష్టం ఏమీకాదు. తనను చెప్పుతో కొట్టి అవమానించిన వ్యక్తిని తన కాళ్ల వద్దకు తెచ్చుకున్నట్టుగా చెప్పుకునే దుర్మార్గపు స్వభావం అది. అయితే చెప్పు దెబ్బ తిన్నప్పుడే నీ పరువుపోయింది, ఇక ఆ తర్వాత ఏం జరిగినా.. నువ్వయ్యేది జీరోనే తప్ప, హీరో కాదు అనే విషయాన్ని రవిప్రకాష్‌ అర్థం చేసుకోలేకపోయినట్టుగా ఉన్నాడు.

అన్నం పెట్టిన ఇంటికే కన్నమేశాడా!
రవిప్రకాష్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ మెంటాలిటీ గురించి చాలామంది జర్నలిస్టులు చెబుతూనే ఉంటారు. ఇక అతడి చీటింగ్‌ గురించి టీవీ నైన్‌ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. టీవీ నైన్‌ నుంచి నిధులు తన ఇష్టానికి వాడుకోవడం, ఎంప్లాయిస్‌ దక్కాల్సిన బోనస్‌ను దోచేయడం.. ఇవీ రవిప్రకాష్‌ చేసిన మోసాలు అని వారు చెబుతూ ఉన్నారు. ఈ అంశాల గురించి పోలీసుల విచారణ సాగుతూ ఉంది. రవి ప్రకాష్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కొన్ని కోట్ల రూపాయల మేర రవి ప్రకాష్‌ దోచేశాడని అభియోగాలు నమోదయ్యాయి. ఇక మరో అంశం.. టీవీ నైన్‌ను అక్రమ నిధులతో స్థాపించారని ఇప్పుడు రవి ప్రకాష్‌ వాదిస్తూ ఉండటం. అంటే.. నిన్ను చానల్‌ నుంచి తన్నితరిమేస్తే కానీ.. అందులోని పెట్టుబడులు అక్రమం అని నువ్వు చెప్పలేవా!

ఇప్పుడు నిన్ను తరిమేశారు కాబట్టి.. అవి అక్రమ పెట్టుబడులు అంటావా! ఇక్కడ కూడా రవి ప్రకాష్‌ కేరెక్టర్‌ ఏమిటో తెలుస్తోందని పరిశీలకులు అంటున్నారు. అతి సాధారణ స్థాయి నుంచి పదిహేనేళ్లలో అసాధారణ స్థాయికి ఎదిగి.. తన అహానికి పోయి రవిప్రకాష్‌ ఇప్పుడు మొదటికే మోసం తెచ్చుకున్నాడని, అతడి బ్లాక్‌ మెయిలింగ్‌, చీటింగ్‌ నేచర్‌ను తనే చాటుకుంటూ, తన తోకకు తనే నిప్పు పెట్టుకున్నాడని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెరమీద నీతులు.. తెర వెనుక బ్లాక్ మెయిలింగ్