జ్యోతిష్యం అన్నది ఓ శాస్త్రం. అయితే అది ఇప్పుడు అనేక ఒడి దుడుకులకు లోనవుతూ వుండోచ్చు. అరకొర జ్ఞానంతో కూడిన ఫేక్ పండితులు ఎక్కువై వుండోచ్చు. దానివల్ల జ్యోతష్యం పై నమ్మకం సడలవచ్చు. కానీ సరిగ్గా ఫలితాలు అంచనా వేసేవారు ఇప్పటికి వుండనే వున్నారనే చెప్పాలి.
యాధృచ్ఛికమో,. ఫలితాలను సరిగ్గా అంచనా వేయడమో, ఆరేడు నెలల కిందట విడుదలయిన, ఈ తెలుగు కొత్త సంవత్సర (శార్వర)పంచాంగంలో ఇప్పుడు సంబంభించిన కరోరా రియాక్షన్ల గురించి వుండడం విశేషం. సాధారణంగా తెలుగు పంచాంగాలు పూర్వం అయితే మార్చి నెలలో వచ్చేవి. కానీ ఇప్పుడు కాంపిటీషన్ పెరగడంతో, నెల నెల వెనక్క జరిగి, ఉగాదికి ఆరేడు నెలలు ముందే మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి.
అలా గత ఏడాది చివరలో మార్కెట్ లోకి వచ్చింది. ఈ పంచాంగంలో పేర్కొన్న కొన్ని విషయాలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
''….కాలసర్పయోగం జరిగే గ్రహ స్థితిలో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. సంవత్సరం చివరి లోగా ఆరు విడతలుగా కాలసర్పయోగం సంభవిస్తోంది..
ఇందువల్ల దేశానికి అరిష్టం. ఉగాది, వసంత పంచమి, ఇలా ముఖ్య పర్వదినాల్లో సైతం అపసవ్వ గ్రహగతులు వున్నాయి.
అందువల్ల పండుగలు, పర్వదినాల ప్రాధాన్యత తగ్గిపోతుంది. ప్రజలు ముక్తసరిగా ఈ పండుగలను చేసుకోవాల్సి వస్తుంది.
పుణ్య క్షేత్రాల్లో, ఉత్సవాల్లో కూడా అపశృతులు తప్పవు
భక్తికార్యక్రమాలకు ఆటంకాలు కలుగుతాయి.
ప్రభుత్వాలు హైందవ సంస్కృతులకు పెద్ద పీట వేస్తాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తగా వుంటూ ప్రజలను కంటికి రెప్పలా చూసుకోవాల్సి వుంటుంది.
భారతదేశ ప్రజలంతా శాంతి సంతోషాలతో ఉండలేరు అనేది సత్యం.
భారత సినీ రంగానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది.
ఆర్థికమాంద్యం పెరిగిపోయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, కొనుగోలు శక్తి తగ్గి, సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల వరకు రుణ పీడలు ఎదుర్కొంటారు.
శార్వరి ఉన్న ఆశలు చిదిపేసేదిగా వుంటుంది.
ప్రతి అంశంలో జాగ్రత్త పడుతూ, ఖర్చులు తగ్గించుకుంటూ, నగదును దాచుకుంటూ వుండాలి.
విశిష్ట దేవాలయాల్లో అపశృతులు దొర్లకుండా చూసుకోవాలి…''
ఇవీ క్లుప్తంగా అందరికీ అర్ధం అయ్యేలా ఆ పంచాంగంలో వున్న సంవత్సర ఫలితాలు.